అష్టదిగ్బంధనంతో కిక్కిరిసిన బెజవాడ

 


విజయవాడకు ఉద్యోగులు ఉప్పెనలా తరలివచ్చి అష్టదిగ్బంధనం చేయడంతో బెజవాడ నగరం కిక్కిరిసిసోయింది. ఉద్యోగస్తులు భారీగా తరలిరావడంతో బి.ఆర్.టి.ఎస్ రోడ్డు పొడవునా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో పోలీసులు పలు మార్గాలు నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.