గురజాల సబ్ డివిజన్ పరిధిలో పర్యటించిన గుంటూరు రేంజ్ డీఐజీ శ్రీ డా.C.M.త్రివిక్రమ వర్మ ఐపీఎస్ గారు మరియు గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు,. గురజాల డిఎస్పీ కార్యాలయం,గురజాల అర్బన్ పోలీస్ స్టేషన్ మరియు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లలో తనిఖీ నిర్వహించిన గౌరవ డీఐజీ గారు మరియు శ్రీ ఎస్పీగారు.
వివిధ పెండింగ్ కేసుల సత్వర విచారణకు పాటించవలసిన విధానాల గురించి సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేసిన గౌరవ డీఐజీ గారు.
ది.11.02.2022 తేదీన గురజాల సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ నిర్వహించడం కోసం విచ్చేసిన గౌరవ డీఐజీ గారికి మరియు శ్రీ రూరల్ జిల్లా ఎస్పీ గారికి గురజాల డిఎస్పీ గారి కార్యాలయంలో మరియు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు సాదర స్వాగతం పలికారు.
తదనంతరం గౌరవ డీఐజీ గారు గురజాల డిఎస్పీ గారి కార్యాలయాన్ని గురజాల అర్బన్ మరియు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, వివిధ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి,అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది మరియు మహిళ పోలీసులతో మాట్లాడి,వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని,ప్రజలకు సేవలందించడానికి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ సందర్బంగా గౌరవ డీఐజీ గారు మాట్లాడుతూ..
ఈ రోజు గురజాల అర్బన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించడం జరిగినది.
పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసుల యొక్క పురోగతి ఏ విధంగా ఉంది,అపరిష్కృత కేసుల వివరాలను పరిశీలించడం జరిగినది.
వివిధ కేసులు ఎంతకాలం నుండి అపరిష్కృతంగా ఉన్నాయి,దానికి గల కారణాలు,వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి అవలంభించవలసిన వివిధ విధానాలు మరియు మెళకువల గురించి స్థానిక పోలీస్ అధికారులకు వివరించడం జరిగినది.
ముఖ్యంగా వ్యక్తుల అదృశ్యంపై నమోదైన కేసులు,SC,ST,POCSO కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన విచారణను ఏ విధంగా చేపడుతున్నారు అని స్థానిక పోలీస్ అధికారులను ప్రశ్నించడం జరిగినది.
పోలీస్ స్టేషన్ నిర్వహణ ఏ విధంగా ఉంది,పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల సిబ్బంది యొక్క స్పందన మరియు ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయాలు గురించి ఆరా తీయడం జరిగినది. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమస్యల గురించి,వారి అవసరతల గురించి తెలుసుకోవడం జరిగినది.
శాంతి భద్రతల పరిరక్షణకు మరియు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణకు పోలీస్ సిబ్బంది యొక్క పాత్ర ఎంతో కీలకం కావున శ్రద్ధగా విధులు నిర్వర్తించాలని సూచించడం జరిగినది.
పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులతో మాట్లాడి,గ్రామాల్లో వారు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు ? స్థానిక పోలీస్ వారికి ఏ విధంగా సహాయపడుతున్నారు?, విధి నిర్వహణలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని తదితర అంశాల గురించి ఆరా తీయడం జరిగినది.
మహిళ పోలీసులు పోలీస్ శాఖలో అంతర్భాగం కావున ధైర్యంగా విధులు నిర్వర్తించాలని,వారికి త్వరలో యూనిఫార్మ్ కూడా అందచేయబడుతుందని తెలపడం జరిగినది.
గురజాల సబ్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్లకు కృష్ణా నదీ తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం మరియు తెలంగాణ రాష్ట్రంతో సరిహాద్దు కలిగి ఉంది కావున అక్రమ అక్రమ కార్యకలాపాలు జరుగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గౌరవ డీఐజీ గారు, శ్రీ రూరల్ ఎస్పీ గారు, గురజాల డిఎస్పీ BM.జయరాం ప్రసాద్ గారు,గురజాల అర్బన్ సీఐ ధర్మేంద్రబాబు గారు,మాచర్ల రూరల్ సీఐ సురేంద్ర బాబు గారు,గురజాల ఎస్సై అశోక్ కుమార్ గారు,నాగార్జున సాగర్ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు.