చేతులెత్తేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.


ముఖ్యంగా ప్రజాప్రతినిధి అంటే.. ప్రజలకు ఇచ్చిన
హామీలను అమలు చేయాలి. పార్టీ ఇచ్చే మేనిఫెస్టోతో పాటు.. స్థానికంగా ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలు కొన్ని హామీలు ఇస్తుంటారు. వాటిని చూసే ప్రజలు వారికి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఆయా సమస్యలపై దృష్టి పెడతారని అనుకుంటారు.

కానీ వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు మాత్రం జీరోలు అయిపోయారనే వాదన వినిపిస్తోంది. కనీసం.. ప్రజల్లోకి వచ్చేందుకు కూడా వారు జంకుతున్నారు. ఎందుకంటే.. నియోజకవర్గం అభివృద్ధి నిధులు కనుక వారికి ఇచ్చి ఉంటే.. ఎంతో కొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి.. పట్టు పెంచుకునే పరిస్థితి.. ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.

కేవలం సంక్షేమ పథకాలకు.. అది కూడా నేరుగా ఇస్తోంది. దీంతో ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య బంధం దాదాపు తెగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఏదీ తమకు తెలియడం లేదని.. కనీసం.. తమ చేతుల మీద ఏ కార్యక్రమం చేయలేక పోతున్నామని.. వారు చెబుతున్నారు.రాజన్న రాజ్యం తెస్తానని చెప్పిన వైసీపీ.. రాజన్న రాజ్యంలో కీలకమైన రైతులను మాత్రం పక్కన పెట్టిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఆర్బీకేలు ఏర్పాటు చేసినా.. ధాన్యం కొనుగోలు జరగదు. సరైన మద్దతు ధర దక్కదు. అదేమని ప్రశ్నిస్తే.. గుంటూరు జిల్లా వినుకొండలో రైతు నరేంద్రను జైలు పాలు చేశారు. వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు.
ఇక ఇటీవల మిర్చి పంట మొత్తం వైరస్తో దెబ్బతింది. దీనిపై రైతులు ఆర్బీకేల్లో ఫిర్యాదులు చేశారు. అయినా.. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి మద్దతు లభించలేదు. మరోవైపు.. రైతులు వినియోగించే ఉచిత విద్యుత్కు మీటర్లు పెట్టాల్సిందే.. అని హుకుం జారీ చేశారు. దీంతో ఇదేనా రాజన్న రాజ్యం అంటూ.. రైతులు మరోవైపు.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.