జగన్, సజ్జల విమర్శలపై పవన్


జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు.
తాను  దత్తపుత్రుడిని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు తాము సృష్టించినవి కావన్నారు.  ఎన్నికలకు ముందు వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగాలు ఇస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారని పవన్ గుర్తు చేశారుఅవి అమలు చేయాలని ఉద్యోగులు  ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రుల కమిటీ ఉద్యోగులు అనేక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఇతర పార్టీలపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు. వైసీపీ నాయకులు ఏం చేసినా ఏ తప్పులు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదా?. ఎవరైనా లోపాలను ఎత్తి చూపితూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర్నుంచి ఉపాధ్యాయులు వరకు ఎవరినీ‌ వదలరా. అందరిపై ఎదురు దాడి చేస్తారా. ఎవరైనా వారి హక్కుల గురించి అడిగే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది.’’ అని పవన్ అన్నారు. 

రాష్ట్రప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఎవరు  మాట్లాడతారని,  సమస్యలపై పోరాడుతున్న వారిని వెక్కిరించడం మంచి పద్ధతి కాదని పవన్ కల్యాణ్ సూచించారు. ‘‘ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నా వ్యాఖ్యలపై స్పందించారు.  కానీ మీ మంత్రులు ఉద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ప్రభుత్వం వారు బాధ్యతగా వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం వల్లే ఆధిపత్య ధోరణి అని నేను మాట్లాడాను. ముందు మీ మంత్రులు మీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పనులు చేస్తే మా లాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం రాదు కదా . ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం చేయిస్తే వచ్చింది కాదు. వారి కడుపు మంటతో  రోడ్లెక్కి ఆందోళన చేశారు. అటువంటి వారికి మద్దతుగా మాట్లాడాల్సిన బాధ్యత పార్టీలపై ఉంది. ఉద్యోగులు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.

 

నా వ్యాఖ్యలలను వక్రీకరించ వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి‌కి సూచిస్తున్నా. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల శ్రేయస్సును కోరుతూ నరసింహ దర్శన యాత్ర చేపడుతున్నా. మా ఇంటి దైవం ఆంజనేయ స్వామిని కొలుస్తూ కార్యక్రమం చేపడతున్నా.  కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటా.  కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి నరసింహ స్వామిని దర్శిస్తా. ప్రజలందరిని చల్లగా చూడమని నరసింహస్వామిని కోరుకుంటాను. మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ,  ఏపీలో పరిమిత సంఖ్యలో నాయకులు హాజరై కార్యక్రమాలు నిర్వహించాలి. జన సైనికులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.