కాసేపట్లో నెల్లూరుకు మేకపాటి గౌతమ్ పార్థివ దేహం..


ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు
. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నిన్న ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురైన గౌతమ్.. కాసేపటికే ప్రాణం విడిచారు. కాసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన పార్థివ దేహాన్ని నెల్లూరుకు తీసుకెళ్లారు. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.గౌతమ్ రెడ్డి హఠాన్మరణాన్ని.. మంత్రి అనిల్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నలాంటి ఆయన్ను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నట్టు చెప్పారు.

కాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్న గౌతమ్ పార్థివదేహాన్ని.. స్వస్థలానికి తరలించనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రులు అనిల్, ఆదిమూలపు సురేష్ పర్యవేక్షిస్తున్నారు.గుండెపోటుతో హ‌ఠాన్మర‌ణం చెందిన ఏపీ ప‌రిశ్రమ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియ‌లు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలో నిర్వహించాల‌ని నిర్ణయించారు మేకపాటి కుటుంబ సభ్యులు. ఉద‌య‌గిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియ‌లు నిర్వహించనున్నారు.