భీమిలి, మధురవాడ జోన్లలో మంచినీటి ఎద్దడి పై మంచినీటి సరఫరా అధికారులతో చర్చించిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. అత్యవసర మంచినీటి సరఫరా ఫై మున్సిపల్ మంత్రి నారాయణ కు తాటిపూడి రిజర్వాయర్ నుండి మంచినీటిని మధురవాడికి అందించేవిధంగా కృషి చేయాలని ఫోన్లో సంప్రదించిన గంటా శ్రీనివాసరావు... మధురవాడ ప్రజలకు మంచినీటిని అందించేందుకు నడుం బిగించిన భీమిలి ఎమ్మెల్యే.గంటా శ్రీనివాస్. ఒకవైపు మంచినీటి ఎద్దడి.. ప్రజలకు మంచినీటి కష్టాలు.... మరోవైపు దూసుకు వస్తున్నా జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు....మధురవాడ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు. భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, (పాత మధురవాడ మెట్ట )-తాటిపూడి నుంచి నీటి విడుదలకు మంత్రి నారాయణతో సంప్రదింపు.విశాఖ నగరంలో ముఖ్యంగా మధురవాడ, భీమిలి జోన్లలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. ఈ మేరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూగురువారం ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో జీవీఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. విశాఖ తాగునీటికి జీవనాడి అయిన తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని గంటా స్పష్టం చేశారు. గోదావరి జలాలు విశాఖకు చేరినా, మధురవాడలోని ఇళ్లలోకి నీరు చేరకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.వెంటనే పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో ఫోన్లో మాట్లాడి, తాటిపూడి నుంచి మధురవాడ, భీమిలి జోన్లకు నీటి విడుదల అత్యవసరమని వివరించారు. విశాఖ, విజయనగరం కలెక్టర్లు సమన్వయంతో నిర్ణయం తీసుకునేలా చూడాలని కోరారు.అధికారులు స్పందిస్తూ.. మధురవాడ కోసం రూ.550 కోట్లతో చేపడుతున్న భారీ వాటర్ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలతో కొరతకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని వివరించారు. ప్రస్తుతం వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటడం వల్లే ఒత్తిడి పెరిగిందని తెలిపారు.4వ వార్డులో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ.4 కోట్లతో రూపొందించిన ప్రత్యేక ప్రాజెక్టు డిజైన్లను కూడా గంటాకు చూపించారు.సమావేశంలో వాటర్ సప్లై ఎస్ఈ పల్లంరాజు, ఈఈ సుధాకర్, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు.మధురవాడ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు. భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, (పాత మధురవాడ మెట్ట )-తాటిపూడి నుంచి నీటి విడుదలకు మంత్రి నారాయణతో సంప్రదింపు.విశాఖ నగరంలో ముఖ్యంగా మధురవాడ, భీమిలి జోన్లలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. ఈ మేరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూగురువారం ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో జీవీఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. విశాఖ తాగునీటికి జీవనాడి అయిన తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని గంటా స్పష్టం చేశారు. గోదావరి జలాలు విశాఖకు చేరినా, మధురవాడలోని ఇళ్లలోకి నీరు చేరకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.వెంటనే పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో ఫోన్లో మాట్లాడి, తాటిపూడి నుంచి మధురవాడ, భీమిలి జోన్లకు నీటి విడుదల అత్యవసరమని వివరించారు. విశాఖ, విజయనగరం కలెక్టర్లు సమన్వయంతో నిర్ణయం తీసుకునేలా చూడాలని కోరారు.అధికారులు స్పందిస్తూ.. మధురవాడ కోసం రూ.550 కోట్లతో చేపడుతున్న భారీ వాటర్ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలతో కొరతకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని వివరించారు. ప్రస్తుతం వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటడం వల్లే ఒత్తిడి పెరిగిందని తెలిపారు.4వ వార్డులో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ.4 కోట్లతో రూపొందించిన ప్రత్యేక ప్రాజెక్టు డిజైన్లను కూడా గంటాకు చూపించారు.సమావేశంలో వాటర్ సప్లై ఎస్ఈ పల్లంరాజు, ఈఈ సుధాకర్, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు.