వాసవి...
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాసవియన్ సేవ సంకల్ప కే సి జి ఎఫ్ శ్రీ సిద్ధ వెంకట సూర్య ప్రకాశరావు జన్మదినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి దర్శి శ్రీనివాసరావు సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా వి201 ఏ రీజియన్ 2 జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం లీలామహల్ దగ్గర గల సరస్వతి పార్కు నందు 9 మొక్కలను క్లబ్ అధ్యక్షులు వెంకటరమణమూర్తి, కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, క్లబ్ సభ్యులు సన్యాసిరాజు సంయుక్తంగా ఈ మొక్కలను నాటారు.. జోన్ చైర్ పర్సన్, క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ సూర్య ప్రకాశరావు ఇంకా ఎన్నో ఎన్నెన్నో జన్మదినములు చేసుకోవాలని, నిత్యము ఎల్లవేళలా ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్యములతో తులతూగాలని , ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించాలని అంతర్జాతీయ అధ్యక్షులు వారినీ ఈ సందర్భంగా కోరారు.