విశాఖపట్నం సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానవ శ్రీను మధురవాడ
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా స్కై పార్క్ లయన్స్ క్లబ్, విశాఖపట్నం ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ లో గల అంబేద్కర్ సామాజిక భవనము నందు క్లబ్బు అధ్యక్షులు లయన్ హరిప్రసాద్ పర్యవేక్షణలో అర్హులైన 20 మంది వృద్ధ మహిళలు కు మూడు వారములకు సరిపడ బియ్యము మరియు పప్పు దినుసులు పంపిణీ చేయడమైనది. క్లబ్బు కోశాధికారి లయన్ విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ తదుపరి సేవా కార్యక్రమం లో భాగంగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దములు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు..ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర రావు, క్లబ్ అదనపు కార్యదర్శి రామారావు,క్లబ్ సభ్యులు తంగుడు రావు ,
వెంకట రామకృష్ణారావు, వెంకటేశ్వర రావు, సూర్యనారాయణ, మాధవరావు,రఘునాథరావు, పాల్గొన్నారు.