(భీమిలి నియోజకవర్గ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
బక్కన్నపాలెం నవోదయ స్కూల్ ఎదురుగా ఉన్న లోటస్ స్పెషల్ స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా GVMC6వ వార్డు కార్పొరేటర్ పోతిన హనుమంతరావు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హనుమంతు మాట్లాడుతూ ఈ ప్రత్యేక మానసిక వికలాంగుల పిల్లలకు సమాజం లో ప్రతీ ఒక్కరు ప్రేమ, ఆదరణ చూపాలని, వారిలో కూడా ప్రజ్ఞ, తెలివి వారికున్న ప్రేమ, ఆదరణ లతో మనందరితో కలసిమెలసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ పిల్లల తల్లి తండ్రులకు వారికి విద్యాభివృద్ధి, సమాజం లో నడవడికలో శిక్షణ ఇస్తున్న పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు . చివరగా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా లోటస్ స్కూల్ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ , ఉపాధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శి సుధారాణి పాఠశాల సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు అందరు పాల్గొని పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.అనంతరం కార్పొరేటర్ హనుమంతు పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు సుధారాణి బాలలందరిని అభినందించారు.. ఈ సందర్భంగా కార్పొరేటర్ హనుమంతుకు చిరు సత్కారం చేసి కార్పొరేటర్ కు అభినందనలు తెలియజేశారు.