రోడ్లు వేస్తామని ఇదే ఏపీఆర్‌డీసీ ద్వారా బ్యాంకుల నుంచి ప్రభుత్వం గతంలో రూ.4,000 కోట్ల అప్పు తెచ్చింది. ఎక్కడా రోడ్డు కాదు కదా.. రోడ్లమీద గుంతలు పూడ్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు మళ్లీ రోడ్లు వేస్తామంటూ ఇంకో ఎస్ర్కో ఖాతా తెరిచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్ మొత్తం ప్రతి రోజూ రాష్ట్ర ఖజానాలో కాకుండా ఈ బ్యాంకులోని ఏపీఆర్‌డీసీ ఎస్ర్కో ఖాతాలో జమ చేస్తారు. ఈ సెస్ రూపంలో ఏటా ప్రభుత్వానికి రూ.700 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అంటే ఈ మొత్తం ఆదాయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకుంటున్న రూ.2,000 కోట్ల రుణానికి సంబంధించి ఈఎంఐలు కడుతుందన్న మాట. ఈ మేరకు ఇటీవల ఆర్థిక శాఖ జీవో 14, రోడ్లు, భవనాల శాఖ జీవో 59ని జారీ చేశాయి. ఈ రెండు ఉత్తర్వులూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని సెక్షన్ 2కి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్ధం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్‌పై అదనంగా రూపాయి సెస్ వసూలు చేస్తున్నారు. మొదట సెస్ ఆదాయంలో 50 శాతాన్ని ఎస్ర్కోకి మళ్లిద్దామనుకున్నారు. కానీ జనవరి, ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఊహించిన స్థాయిలో అప్పులు అందలేదు.
దీంతో మొత్తం సెస్ ఆదాయాన్నీ ఎస్ర్కోకి మళ్లిం చి అదే బ్యాంకు నుంచి వీలైనంత అప్పు తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రుణ వాయిదాల రూపంలో ఆ బ్యాంకుకు ఏడాదికి రూ.700 కోట్లకు పైగా కట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి సంస్థ(ఏపీఎ్‌సడీసీ) నుంచి తెచ్చిన రూ.25,000 కోట్ల దొంగ అప్పునకు సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది. అదలా పెండింగ్‌లో ఉండగానే మరో కార్పొరేషన్ నుంచి అదే తరహాలో దొంగ అప్పులు తెచ్చేందుకు జీవోలు కూడా ఇవ్వడం గమనార్హం. ఏపీఎ్‌సడీసీ, పీఎ్‌ఫసీ, బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీఎ్‌సఎ్‌ఫసీఎల్, ఏపీఆర్‌డీసీ నుంచి తెచ్చిన వేల కోట్ల అప్పులకు ఖజానా నుంచి రీపేమెంట్ చేస్తున్నారు. వేల కోట్ల అప్పులను కార్పొరేషన్ల పేరుతోనే తెచ్చినప్పటికీ ఆ మొత్తాలను ప్రభుత్వమే వాడుకుని ఖజానా నుంచి వాటి వాయిదాలు కడుతున్నామని చెబుతోంది. కానీ ప్రభుత్వ అప్పు కింద వీటిని చూప డం లేదు. ఇలా దాచడం ద్రవ్యనియంత్రణ-బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టంలోని సెక్షన్ 2కి విరుద్ధం. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకు ని, కేంద్రం కళ్లకు గంతలుకట్టి తెస్తున్న ఈ అప్పులను ప్రభుత్వం సొం త అవసరాలకు వాడుతోంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన అనుమతులకు మించి అదనంగా అప్పులు తేవాలంటే మళ్లీ కేంద్రం అనుమతి కావా లి. ఎందుకంటే రాష్ట్రం పబ్లిక్ డెట్ రూ.4 లక్షల కోట్లు ఉంది. దీనికి మించి అదనపు అప్పు తేవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలి. కానీ కేంద్రం అనుమతించదు కాబట్టి ఇలా కళ్లకు గంతలు కట్టి తీసుకొస్తున్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సెక్షన్ 2 ప్రకారం కేంద్రం అనుమతిచ్చిన ఓఎంబీ అప్పులు, ప్రాజెక్టు భాగస్వామ్యంతో నాబార్డు, హడ్కో నుంచి ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు, ఈఏపీ లోన్లు, ఎన్‌సీడీసీ లో న్లు, ఉద్యోగుల జీపీఎప్, ఏపీజీఎల్‌ఐ డబ్బులను ప్రభుత్వం వాడుకోవ చ్చు. వీటినే పబ్లిక్ డెట్‌గా పరిగణిస్తారు. వీటికి మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయాలి. ఇవి కాకుండా ఏదైనా కార్పొరేషన్ అప్పును తన ఖజానా నుంచి చెల్లిస్తే ఆ అప్పు కూడా పబ్లిక్ డెట్ పరిధిలోకి వస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో వీలైనన్ని అప్పులు చేయడం కోసం కార్పొరేషన్ల ద్వారా తెచ్చి వాడుకున్న అప్పులను పబ్లిక్ డెట్‌లో చూపకుండా కేంద్రాన్ని మోసం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక అంధకారంలోకి నెట్టేస్తోంది