ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం వేకువ జాము నుంచే రధసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి కైంకర్య సేవలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనివార్య కారణాల వల్ల విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి హాజరు కాలేదు. ఫలితంగా ఆలయ అర్చకులతోనే కైంకర్య సేవలు పూర్తయ్యాయి.