పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Prajabalam NewsFebruary 23, 2022
ఈ సంవత్సరంలో సీబీఎస్ఈ తో పాటు ఇతర రాష్ట్ర బోర్డు లు ఆఫ్ లైన్ లో నిర్వహించే పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తిరస్కరించిన సుప్రీం ఇలాంటి పిటిషన్ ల వల్ల విద్యార్థుల్లో పరీక్షలపై గందరగోళం ఏర్పడుతుందని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహించే బదులు ఇతర ప్రత్యామ్నాయ విధానాల్లో పరీక్షలు నిర్వహించాలని పిటిషనర్ న్యాయ స్థానాన్ని కోరారు. కేవలం సీబీఎస్ఈ పరీక్షలు మాత్రమే గాక.. రాష్ట్రాల పరిధిలో నిర్వహించే పదో తరగతి ప్లస్ పరీక్షలు ఆఫ్ లైన్ లో జరిగేలా కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. అయితే దీనిపై పిటిషన్ వాదన విన్న ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వం లోని సుప్రీం ధర్మాసనం... ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో తప్పుడు భావనను తీసుకెళ్తాయని వ్యాఖ్యానించింది. అంతేగాకుండా వారిలో గందరగోళ స్థితి కలగజేస్తాయి పేర్కొంది. కరోనా వైరస్ ఇంకా పూర్తి స్థాయిలో సమసి పోకుండా ఉన్న నేపథ్యంలో ఆఫ్ లైన్ పరీక్షలను నిర్వాహించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని సుమారు 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆఫ్ లైన్ కు బదులుగా వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఫలితాలను ప్రకటించిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం... ఇలాంటి పిటిషన్లు విద్యార్థులతో పాటు విద్యా వ్యవస్థలో కూడా గందరగోళాన్ని పుట్టిస్తాయని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు మరోసారి ఇతరులు వేసే అవకాశం ఉందని తెలిపింది. ఇలాంటి ఓ సంప్రదాయంగా మారకుండా ఉండాలని కోరింది. జరగబోయే పరీక్షలకు సంబంధించిన అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తు చేసింది. కావున ఈ పిటిషన్ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పరీక్ష తేదీల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని కూడా సూచించింది.