వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సంప ద్వాసవి వ్రతం , వాసవి మాత జీవిత చరిత్ర శ్రీకృష్ణ శర్మ నేతృత్వంలో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రతమాచరించారు.
January 20, 2026
విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవి
తేదీ 20.01.2026 మంగళ వారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు స్థానిక ప్రేమసమాజం ఏసీ హాల్ నందు
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్,
వి 201 ఏ విశాఖపట్నం జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప *కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి శ్రీమతి వంకాయల సాయినిర్మల ఆధ్వర్యంలో
*సంపద్వాసవి వ్రతం* మరియు వాసవి మాత జీవిత చరిత్ర
శ్రీ కృష్ణ శర్మ గారి నేతృత్వంలో సుమారు 200 మంది మహిళా వాసవి సబ్యులు పాల్గొనగా అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ వ్రతంలో పాల్గొన్న మహిళలకు లక్కీ డిప్ గా ముగ్గురికి చీరలు బహుకరించినారు. అదేవిధంగా ప్రత్యేక బహుమతిగా ఒకరికి, తొమ్మిది రోజులు కాశీలో నివాసమునకు మరియు అల్పాహారము ,భోజన సదు పాయమునకు గిఫ్ట్ ఓచర్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవియన్ డైమండ్ స్టార్ కె సి జి ఎఫ్ శ్రేయోభిలాషి కంకటాల ప్రభాకర్ గారు వ్రతం యొక్క ప్రాధాన్యత, తెలుపుతూ ఈ వ్రతం లో పాల్గొన్న మహిళల అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పూర్వపు అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ ఏవీఎస్ఎన్ గుప్తా, ఐ.ఈ.సి.అధికారులు కె. వి. గుప్తా,సోమేశ్వర రావు,కీర్తన,నల్లూరి నూకరాజు,నాగరాజు,అంతర్జాతీయ డైరెక్టర్ వాసవియన్ తమ్మన అమర్నాథ్, క్యాబినెట్ సెక్రటరీ బి వి పద్మావతి,జిల్లా కోశాధికారి వాసవియన్ చెరుకు క్రిష్ణ జిల్లా ఆధ్యాత్మిక విభాగపు ఇంచార్జ్ ముత్తా సతీష్, ప్రోగ్రాం చైర్ పర్సన్
బి వి సావిత్రి, క్యాబినెట్ సేవా విభాగము సెక్రటరీ గరుడా రమణి, మరియు , రీజనల్ చైర్ పర్సన్స్, రీజనల్ సెక్రటరీస్, జోన్ చైర్ పర్సన్స్, వివిధ క్లబ్బుల అధ్యక్షులు పాల్గొన్నారు.
అదేవిధంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్తా, పూర్వపు అధ్యక్షులు,జోన్ 2 చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు మరియు క్లబ్ సభ్యులు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంను సందర్శించి పూజలు జరిపి ఆలయం పునర్నిర్మాణ దశలో ఉన్న సందర్భంగా క్లబ్ తరఫున
విరాళం ఇవ్వడం జరిగినది.


