డాక్టర్ మణి భూషణ్ కు ఉత్తమ పర్యాటక చిత్రం 'ప్రతిభా పురస్కారం--- మంత్రిరోజా చేతుల మీదగా అందజేత

 డాక్టర్ మణి భూషణ్ కు రాష్ట్ర పర్యాటకశాఖ "ఉత్తమ పర్యాటక చిత్రం " ప్రతిభా పురస్కారం.


 మధురవాడ--- ప్రజాబలం న్యూస్ --

నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి సమర్పణలో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వంలో ప్రకృతిరమణీయతను కళ్ళకు కట్టినట్లు రూపుదిద్దుకున్న చిత్రం " అగ్రీ టూరిజం " ఎంపవర్ ఎర్త్ అనే ఉపశీర్షిక తో విడుదలైన డాక్యుమెంటరీ ఎంతోమంది ప్రముఖల ప్రశంసలు పొందింది, ఈ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా జరిపే ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమం లో భాగంగా జరిగే ప్రతిభా పురస్కారాల్లో భాగంగా ఉత్తమ పర్యాటక చిత్రం అవార్డు ను డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యం "అగ్రీ టూరిజం " కు ప్రతిభా పురస్కారం అవార్డును రాష్ట్ర ప్రభుత్వ పర్యాటకశాఖ వారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన కార్యక్రమం లో "ఉత్తమ పర్యాటక చిత్రం" అవార్డు తో ముఖ్య అతిది శ్రీమతి ఆర్ కె రోజ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి మల్లాది విష్ణు, పర్యాటక శాఖ ఎం డి శ్రీ కన్నబాబు, ఇతర కలెక్టర్ ల చేతులమీదుగా ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతు పర్యాటకం వ్యవసాయం రెండు మానవజాతి మనుగడకు ఆయువుపట్టులాంటివి అలాంటి రెండురంగాలను ఒకటి గా చేసి అగ్రి టూరిజం అనే కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు మన వ్యవసాయ పద్దతులను , ప్రకృతి , సహజ వనరులను ఉపయోగించి చేసే వ్యసాయాన్ని అందరు తెలుసుకునేలా , ఉపాధి మరియు ఆర్ధిక స్వావలంబన పొందేలా ప్రతి రైతు తన పంటను, తన భూమిని, తాను చేసే పని అందరికి పరిచయం చేసేలా , వ్యవసాయం మరియు పర్యాటకం అభివృద్ధికి దోహదపడేలా ఈ విధానం సరిక్రొత్త ఆవిష్కరణలు అన్నిటిని అందరికి చైతన్యం తీసుకువచ్చేలా ఈ చిత్రం ఉంటుందని . మంచి చిత్రాలను అందించేలా మా సేవలు వినియోగించు కుంటున్న వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ అవార్డు ద్వారా పర్యాటకం పై ఉన్న భాద్యత మరింత పెరిగిందని రాబోయో రోజుల్లో ఎన్నో వినూత్న ఆవిష్కరణలతో అందరిని అలరించే ప్రయత్నం చేస్తామని విశాఖ ప్రజలు అందరికి రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ, హీరో నిర్మాత ఆదిత్యభూషణ్ పాల్గొని దర్శకుడు డాక్టర్ మణి భూషణ్ కు శుభాభినందనలు తెలిపారు.