సంపూర్ణ ప్రజారోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష --- విద్యా వైద్య రంగానికి పెద్ద పీట -- ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జగనన్న అడుగులు --- మంత్రి విడుదల --అవంతి.

 భీమిలి నియోజక


వర్గం -మధురవాడ- ప్రజాబలం న్యూస్ -- ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న తపనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేశారని దీనిని అందరూ సద్వినియోగం చేసుకొని,తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని వైద్య విద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజినికోరారు. అవ్వ తాతలకు జగనన్న ఆరోగ్య సురక్ష ఎంతగానో మేలు చేస్తుందని వారి గడపకి వెళ్లి ఆరోగ్యాలు తెలుసుకొని మందులు పంపిణీ చేసే కార్యక్రమం జగనన్న ప్రభుత్వం చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు.ఎక్కడా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జగన్ అన్న ప్రభుత్వం చేపడుతోందని సంక్షేమ పథకాలే జగనన్నకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సోమవారంభీమిలి నియోజకవర్గం : 6 వార్డు. 36 సచివాలయం పరిధిలో గల అమరావతి నగర్ కాలనీలో గల యూపీ సిహెచ్ లో...

 కార్పొరేటివ్ హాస్పిటల్స్ స్థాయి వైద్యం ప్రతి పేదవాడికి అందించాలని ఒక సంకల్పంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన. 

 'జగనన్న ఆరోగ్య సురక్ష ' 

 భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ముత్తముసెట్టి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరోగ్య సంక్షేమం వైద్యవిద్య శాఖ మంత్రి విడుదల రజిని, పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో

 విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు 

 జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, మధురవాడ జోన్ 2 కన్వీనర్ కె. కనకమాలక్ష్మి, డీఎంహెచ్వో . పి జగదీశ్వర్ రావు, వైద్య అధికారులు, స్పెషలిస్ట్ డాక్టర్స్, 5,6,7 వార్డు అధ్యక్షులు, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ,ఆర్పీలు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.