భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా విశాఖలో ఎండాడ లో శ్రీ సత్య.సాయి మందిరం వారి ఆధ్వర్యంలో వారోత్సవాలలో భాగంగా బాల వికాస్ విద్యార్థులచే పలు కార్యక్రమాలు. ఎండాడ మందిరం కన్వీనర్ ఏవి రామకృష్ణారావు పర్యవేక్షణలో ఘనంగా జరుగుతున్న ఈశ్వరమ్మ వర్ధంతి వారోత్సవాలు.
May 03, 2026
ఓం శ్రీ సాయిరాం...
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,విశాఖపట్నం జిల్లా... శ్రీ సత్య సాయి మందిరం , ఎండాడ వారి ఆధ్వర్యంలో వస్తున్న 6 వ తేదీ న సత్య సాయి బాబా వారి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న వారోత్సవములలో భాగంగా మే 1, 2, 3 తేదీలలో బాలవికాస్ చిన్నారులచే మొదటి రోజు వాక్ ఫర్ వాల్యూస్ (విలువలతో కూడిన నడక), రెండవ రోజు చిత్రలేఖనం పోటీలు, మూడవరోజు బాల వికాస్ పిల్లలచే వాళ్ల తల్లిదండ్రులకు పాదపూజలు, శ్లోక పఠనం, నామ సంకీర్తన మొదలైన కార్యక్రమములు చక్కగా ముగిసినవి. మూడవరోజు ప్రత్యేక కార్యక్రమముగా
*బి పాజిటివ్* *పేరెంటింగ్ విధానము* పై మందిరం బాలవికాస్ టీచర్ శ్రీ రఘునందన రాజు (ప్రస్తుతం సమాజంలో పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ల తల్లిదండ్రులు పిల్లలు ను ఏ విధంగా ప్రోత్సహించాలి ,వాళ్ళను తీర్చిదిద్దడం ఇత్యాది విషయములపై ) ప్రొజెక్టర్ ద్వారా వీడియో ప్రదర్శించి తెలియజేస్తూ కొనసాగించిన ప్రసంగం పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఆకట్టుకన్నది. తదనంతరం ఆయన రూపొందించిన బాల వికాస్ ఆధ్యాత్మిక డైరీ ని మందిరం కన్వీనర్ వెంకట రామకృష్ణారావు ఆవిష్కరించినారు.సిటీ సమితి కన్వీనర్ శ్రీ సాయికుమార్ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించి, చిత్రలేఖనములో విజేతలకు బహుమతి ప్రధానం చేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాలవికాస్ ఇంచార్జ్ మాధవి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను శ్రీ సత్య సాయి సేవ సంస్థలు అద్భుతంగా నిర్వహిస్తున్నాయని ,ఇందులో పాల్గొంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదృష్టవంతులని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మందిరం ఇన్చార్జి కృష్ణారావు, స్కిల్ డెవలప్మెంట్ ఎండాడ, బాల వికాస్ ఇంచార్జ్ కమల శ్రీ, బాల వికాస్ టీచర్ శ్యామల, గోపి, నాగవేణి, కనకమహాలక్ష్మి, పద్మజ మరియు భక్తులు, బాలవికాస్ పిల్లలు, తల్లిదండ్రులు మందిరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించిన బాలవికాస్ టీచర్లకు, మరియు పిల్లల తల్లిదండ్రులకు, కన్వీనర్ ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపినారు.



