7వ వార్డు కార్పొరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలు.

భీమిలి నియోజకవర్గం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్బంగా భీమిలి ఎమ్మెల్యే మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపుమేరకు ఏడవ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ నెంబర్ పిళ్ళా మంగమ్మ ఆదేశంతో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు 7వ వార్డు లో వాంబే కాలని లో అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ వెంకటరావు చంద్రబాబు విజనరీ నాయకత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజల హర్షద్వానాల మధ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు సెక్రటరీ కానూరి అచ్యుత్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గ రావు గారు పోతిన బుజ్జి టీడీపీ సీనియర్ నాయకులు పోతిన నాయుడు 5వ వార్డు ప్రెసిడెంట్ నాగోతి సత్యనారాయణ గారు శ్రీనాదం మల్లువలస రాము టీడీపీ శంకర్ మహిళా అధ్యకులు నోడగల భవాని కిషోర్ రోజా కొమర కోటేశ్వరరావు రామారావు రాజు లావణ్య లక్ష్మీ కాంతం వెంకటరమణ ఆలం తెలుగుదేశం సీనియర్ నాయకులు, వార్డు ముఖ్య కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.