జామి మండలంలో ఏసీబీ దాడులు. ముడుపులు మత్తులో జోగుతున్న రెవెన్యూ అధికారులు.. 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విఆర్వో.... భూముల ధరలకు రెక్కలు రావడంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా రెవెన్యూ అధికారుల లంచాల డిమాండ్. లంచాలకు అడ్డాగా మారిన సచివాలయాలు..
May 14, 2025
ఏసీబీకి చిక్కిన వీఆర్వో --- భూములు ధరలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా లంచావతారం ఎత్తుతున్న రెవెన్యూ అధికారులు... ముడుపుల మత్తులో జోగుతున్న రెవిన్యూ...
విజయనగరం జామి మండలం: ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.. తెలగా పాలెం )
విజయనగరం జిల్లా జామి మండలం అలమండ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అలమండకు చెందిన మిడతాడ సూరీడమ్మ జామి తాసిల్దార్ కార్యాలయంలో తన భూమిని ఆన్ లైన్ లో మ్యుటేషన్ చేయుటకు దరఖాస్తు చేసుకుంది. దీంతో వీఆర్వో ఆర్నేపల్లి వేణు వారి నుండి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు.మంగళవారం రాత్రి వీఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్
హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అధికారులు బుధవారం
తెలిపారు..