నేటితో 100 అమృత కలశాలు అర్హులైన పేదలకుపంపిణీ పూర్తిచేసిన ఎం వి వి సిటీ సత్య సాయి సెంటర్ భక్తులు, విశాఖ సిటీ, పీఎం పాలెం ఎ సి ఏ వి డి సి ఏ పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా ఎం వివి సిటీ సత్య సాయి సెంటర్ నిర్వాహకులు శివాజీ,రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న సత్య సాయి శత జయంతోత్సవాలు.
November 07, 2025
వికలాంగులకు వృద్ధులకు అమృత కలశాల పంపిణీ. ఎం వివి సిటీ సత్యసాయి సెంటర్.
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష 100 వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంవీవీ సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా 100 అమృత కలశముల పంపిణీ కార్యక్రమంలో 16 మంది ఎంపిక చేసిన లబ్ధిదారులకు గురువారం పాత మధురవాడ, వాంబేకాలనీ లో గల నివాసితులకు నెల రోజులకు సరిపడగా 10 కేజీల బియ్యము, పప్పు దినుసులు ,నూనె, పంచదార గోధుమపిండి వగైరా వస్తువులు పంపిణీ చేయడం జరిగినది. వృద్ధులకు, వికలాంగులకు, నీది పేదలకు పంపిణీ జరిగింది.ఈ సేవా కార్యక్రమంలో ఎం వి వి సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ నిర్వాహకులు వెంకట శివాజీ, వెంకట రామకృష్ణారావు,సేవాదళ్ సభ్యులు మల్లికార్జున రావు, చంద్రశేఖర రావు, మానం శ్రీనివాస్, రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు..

