అభివృద్ధి బాటలోమధురవాడ, మధురవాడకు మహర్దశ,3.23 కోట్ల రూపాయలతో అధునాతనమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆరు నెలల లో చంద్రంపాలెం హైస్కూల్ విద్యార్థులకు బ్రిడ్జిని అంకితం చేయనున్న బ్రిడ్జిని అంకితం చేయనున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.. సర్వత్ర హర్షం.,
November 10, 2025
మధురవాడ కు ల్యాండ్ మార్క్ గా చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి
3.23 కోట్ల రూపాయలు నిధులు మంజూరు.
ఆర్నెల్ల లో అందుబాటులోకి తీసుకురావాలన్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా.
విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
మధురవాడ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అయ్యేలా చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అధునాతనమైన డిజైన్ తో నిర్మించి.. ఆర్నెల్ల లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. రూ. 3.23 కోట్లతో ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధురవాడ ప్రజల చిరకాల వాంఛని, దురదృష్టవశాత్తు నేషనల్ హైవే, మెట్రో విభాగాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత ఆల్యమైందన్నారు. ఈ అభ్యంతరాల కారణంగానే స్వచ్ఛందంగా బ్రిడ్జి నిర్మాణానికి ముందుకువచ్చిన యాడ్ ఏజెన్సీ యాజమాన్యం వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల మెట్రో ప్రాజెక్టు డిజైన్ కు ఆటంకం ఏర్పడే అవకాశముందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని వివరించి డిజైన్ మార్పునకు ఒప్పించానన్నారు. 4 వేల మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన చంద్రంపాలెం పాఠశాలకు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు దాటి వచ్చే ప్రయత్నంలో అనేకమంది విద్యార్థులు, సామాన్యులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ఈ సమస్యకు తెర పడుతుందన్నారు. వర్షం పడితే నీరు నిలిచిపోతున్న చంద్రంపాలెం పాఠశాల క్రీడా మైదానానికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి డిజైన్ల ను ఎమ్మెల్యే గంటా పరిశీలించారు.
విశాఖకు మరిన్ని ప్రాజెక్టులు
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో రూ. 10 లక్షల కోట్ల పరిశ్రమలకు ఒప్పందాలు జరగనున్నాయని.. వాటిలో విశాఖ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని గంటా చెప్పారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, సత్వా వంటి అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు కానుండడంతో విశాఖ రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్ కానుందన్నారు. వచ్చే ఏడాది జులైకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రూ. 175 కోట్లతో 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్లా మంగమ్మ, లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గాడు వెంకటప్పడు, గంటా నూకరాజు, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, నాగోతి సత్యనారాయణ, మామిడి దుర్గారావు, కె.అచ్యుతరావు, గరే గుర్నాథ్, మంగాదేవి, గాడు అప్పలనాయుడు, బోయి రమాదేవి, దొరబాబు, పోతిన ప్రసాద్, లొడగల జానకిరాం తదితరులు పాల్గొన్నారు.

