విశాఖ, వాసవి క్లబ్ జోన్ టు ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రాత్రంతా జాగారం చేసిన శివ భక్తులు సాగర తీరంలో స్నానమాచరించి సీతా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసిన భక్తులకు పులిహోర, కేసరి హల్వా ప్రసాదం వితరణ. ప్రత్యేక ఆహ్వానితులు జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల -- క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి.
February 16, 2026
విశాఖపట్నం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి... జై జై వాసవి 🙏
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్,
వి 201 ఏ, రీజియన్ 2,
జోన్ 2.. వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 16.02.2026 సోమవారం మహాశివరాత్రి సందర్భంగా జాగారం చేసి సాగర తీరంలో స్నానమాచరించి , సాగర శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి వారి ఆలయ దర్శనార్ధం వచ్చిన సుమారు 3000 మంది భక్తులకు పులిహోర,కేసరి హల్వా ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది .ఈ సేవా కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్న జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప స్టార్ కె సి జి ఎఫ్ వంకాయల సాయినిర్మల గారికి, క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి గారికి, రాంగోపాల్ గారికి, అమరా శ్రీరామ్మూర్తి గారికి, ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి వాసవియన్ నర్సింగరావు, వాసవియన్ కేబినెట్ కోశాధికారి వాసవియన్ చెరుకు కృష్ణ, రీజియన్ 2, జోన్ 2 చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు, రీజనల్ సెక్రటరీ గోగుల కమల్ కుమార్, ప్రోగ్రాం చైర్ పర్సన్ వాసవియన్ శివరామకృష్ణ, వాసవియన్ పెన్నం వంశీధర్, గ్రంధి వాసుదేవ మూర్తి, పూర్వపు అధ్యక్షులు వాసవియన్స్ నర్సింగరావు, గ్రంధి కృష్ణారావు, మల్లేశ్వర గుప్తా మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
-
Newer

Older