ఐక్యమత్యంతో సమన్వయ పరుచుకుంటూ వాసవి క్లబ్ సేవలు విస్తృత పరచాలి.-. సేవలోనే ఆత్మసంతృప్తి.. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ v201 ఏ రీజియన్ 2 చైర్ పర్సన్ వాసివియన్ తమ్మన మానస నిర్వహణలో క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్. లో ముఖ్య అతిథిగా వాసవి ఎన్ సిల్వర్ స్టార్ కే సి జి ఎఫ్ కే మోహనలక్ష్మి.
February 05, 2026
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ.
వాసవి...
తేదీ 05.01.2026 గురువారం
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్
వి 201 ఏ రీజియన్ 2 చైర్ పర్సన్స్ వాసవియన్ తమ్మన మానస గారి నిర్వహణలో వారి గృహమందు క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ ముఖ్య అతిథి మరియు పైలెట్ ఫ్యాకల్టీ గా హాజరైన వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజిఎఫ్ కె.మోహనలక్మి
(కీర్తన) ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రెటరీ (మల్టిపుల్) గారు నిర్వహించినారు.ఈ ట్రైనింగ్ సెమినార్ లో హాజరైన జోన్ 2 క్లబ్ ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారులకు తగు సూచనలు,సలహాలు ఇచ్చి వి సి ఐ యొక్క విధి ,విధానాలు తెలియజేసి ప్రతి ఒక్కరు తప్పని సరిగా విప్రో పుస్తకము చదివి అన్ని విషయాలు తెలుసుకోవాలని,క్లబ్ కు సంబంధించిన అన్ని ఫారములు నిర్ణీత సమయంలో సమర్పించాలని, క్లబ్ మెంబర్షిప్, క్లబ్బుల అభివృద్ధి మొదలైనవి అందరితో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ప్రేమ తత్వముతో ఉండి,సేవా కార్యక్రమాలు లో భాగంగా క్లబ్ క్యాలండర్ యాక్టివిటీస్ తో పాటు శాశ్వత కార్యక్రమాలు నిర్వహించి రీజియన్ 2 ఉన్నత స్థాయిలో ఉన్నట్లు క్లబ్ *పి ఎస్ టి* లు సహకరించాలని కోరారు.అంతర్జాతీయ డైరెక్టర్ వాసవియన్ తమ్మన అమర్నాథ్ గారు కూడా తన సలహాలు ,సూచనలు వివరిస్తూ జిల్లాలో గల వాసవి క్లబ్బులు అన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.వైస్ గవర్నర్ వాసవియన్ చందన గారు మాట్లాడుతూ క్లబ్ లు ఉన్నత స్థాయిలో పనిచేస్తే జిల్లా కూడా ప్రగతి పథం లో ఉంటుందని దానికి తగిన కృషి అందరూ చేయాలని.అందులో ఉన్న తృప్తి మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేసినారు. చివరిగా మానస గారు మాట్లాడుతూ మన రీజియన్ 2 ఉన్నత స్థాయిలో ఉన్నట్లు మీరందరూ తప్పకుండా సహాయ సహకారాలు అందించి చక్కటి కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ 2 కార్యదర్శి వాసవియన్ గోగుల కమల్ కుమార్, జోన్ 2 చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు వివిధ క్లబ్బుల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధికారులు పాల్గొన్నారు.

