విశాఖ జిల్లా, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఎండాడ శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ వారోత్సవాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసిన కన్వీనర్ ఏవి రామకృష్ణారావు ఎండాడ పురవీధుల్లో బాలవికాస విద్యార్థుల ర్యాలీ .
May 02, 2026
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ (: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
ఓం శ్రీ సాయిరాం..
తేదీ 01.05.2026 శనివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు విశాఖపట్నం జిల్లా, శ్రీ సత్య సాయి భజన మండలి ఎండాడ వారి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ వారోత్సవములు సందర్భంగా ముందుగా మందిరం కన్వీనర్ వెంకట రామకృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేయగా , బాలవికాస్ ఇంచార్జ్ రఘునందనరాజు, శ్రీమతి కమలశ్రీ లు వాక్ ఫర్ వాల్యూస్ (విలువలతో కూడిన నడక) బాలవికాస్ విద్యార్థులచే ఎండాడ పురవీధులలో నిర్వహింప చేశారు. తదనంతరం మందిరము నందు పిల్లలచే స్వామివారికి తండులార్చన,నామ సంకీర్తన చేయించినారు. కార్యక్రమానికి ముందుగా వచ్చిన పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, గోపి, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.


