మురళి నగర్ లో డాక్టర్ జ్యోత్నాస్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ వెల్నెస్ క్లినిక్ ప్రారంభం - విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను.-

మురళీనగర్‌లో డాక్టర్ జ్యోత్స్నాస్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ వెల్నెస్ క్లినిక్ ప్రారంభం. విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ): విశాఖపట్నం మురళీనగర్‌లోని మస్జిద్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ జ్యోత్స్నాస్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ వెల్నెస్ క్లినిక్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు హాజరయ్యారు. క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ జ్యోత్స్న ఆహ్వానం మేరకు విచ్చేసిన అతిథులు క్లినిక్‌ను ప్రారంభించి, అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: మజ్జి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "ఆరోగ్యమే మహాభాగ్యం" అని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు. ఇటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు స్థానికులకు అందుబాటులోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులతో పాటు: చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు క్లినిక్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.