విజయనగరం, జూన్ 19: ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.(9502817542)
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి తనయ, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరమ్మ, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా అమ్మవారిని సందర్శించిన సిరమ్మకు, ప్రదీప్ నాయుడు లకు ఆలయ కమిటీ సభ్యులు మరియు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం, అమ్మవారి సన్నిధిలో సిరమ్మ, ప్రదీప్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.