విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్న గిరిప్రదర్శన భక్తులకు ప్రసాదం వితరణ. ఎంవిపి కాలనీలో సుమారు 20,000 మంది భక్తులకు ప్రసాదం వితరణ. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన. వి 2o1 ఏ, రీజియన్ టు జోన్ 2, విశాఖ జిల్లా గవర్నర్ వాసవియన్ వంకాయలు సాయినిర్మల, ఎంవిపి కపుల్స్ వాసవి క్లబ్ అధ్యక్షులు వాసవి ఎన్ వెంకటరమణమూర్తి, జోన్ 2 చైర్పర్సన్ వాసవి ఎన్ ఏవి రామకృష్ణారావు

జై వాసవి జై జై వాసవి.
 విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

తేదీ 28.07 .2026 మంగళవారం విశాఖ జిల్లా వి 201 ఏ, రీజియన్ 2 , జోన్ 2 లో గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ విశాఖపట్నం జిల్లా గవర్నర్ వాసవియన్ వంకాయల సాయి నిర్మల గారి అధికార పర్యటన మరియు శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి సింహాచల గిరిప్రదక్షిణ చేయ భక్తులకు ప్రసాది వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, జోన్ చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు వాసవిమాతకు జ్యోతి ప్రజ్వలన చేసి గిరి ప్రదక్షణ చేయు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించినారు.సుమారు 20,000 మందికి పైబడి భక్తులు కు టీ,పకోడీ, బిస్కెట్స్, బన్స్, డ్రింక్స్, తీపి బూంది పంపిణీ చేసినారు. సాయంత్రం ఐదు గంటల మొదలుకొని అర్ధరాత్రి వరకు ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఎంవిపి కాలనీ ,సెక్టార్ 7, కెనరా బ్యాంక్ బిల్డింగ్ (జామి ఫంక్షన్ హాల్ ఎదురుగా) నిర్వహించడం జరిగినది.బిల్డింగ్ యజమాని గోపి గారు,అమర శ్రీరామ్మూర్తి, సుబ్రహ్మణ్యం గారు మరియు క్లబ్ సభ్యులందరి సహాయ సహకారంతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందులకు క్లబ్ అధ్యక్షులు అందరికీ ధన్యవాదములు తెలిపినారు. తదనంతరం జిల్లా గవర్నర్ సాయినిర్మల గారు అధికారిక పర్యటనలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి క్లబ్బు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ రానున్న కాలంలో మరిన్ని సేవలు చేసి క్లబ్ ను ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని కోరారు.సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబమునకు వడ్డీ లేని రుణముగా రూ.20,000/- రూపాయలు గవర్నర్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారికి క్లబ్ సభ్యులు సాలువ తో సత్కరించినారు.తదుపరి సాయి నిర్మల గారు ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలలో జిల్లా సేవా విభాగపు కార్యదర్శి రమణి, క్లబ్బు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి నర్సింగరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ, ఇంటర్నేషనల్ డైరెక్టర్ తమ్మన అమర్నాథ్ (ఇంటర్నేషనల్ అదనపు కోశాధికారి ),రీజియన్ చైర్ పర్సన్ తమ్మన మానస, జిల్లా అదనపు కోశాధికారి గ్రంధి వాసుదేవ మూర్తి, పూర్వపు గవర్నర్ యుగంధర్ రావు, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు, గోగుల నర్సింగరావు ,క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.