పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
గురువారం జీవీఎంసీ 8వ వార్డు స్వర్ణభారతి నగర్ లో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మందికి రూ. 2,728 కోట్ల పెన్షన్లను ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రూ. లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, 8వ వార్డు జనసేన అధ్యక్షులు సేకరి శ్రీను, చెట్టుపల్లి సన్యాసిరావు, జి కృష్ణ కుమార్, చెట్టుపల్లి గోపీ, లొడగల అప్పారావు, మంగాదేవి, లొడగల జానకిరాం తదితరులు పాల్గొన్నారు.