వైశాఖి స్కై పార్క్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో , స్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీ నందు ప్రత్యేకించి సెక్యూరిటీ గార్డ్స్ కు, హౌస్ వర్కర్స్ కు , కమ్యూనిటీలో నివాసితులకు సుమారు 100 మందికి పైబడి పేషెంట్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు..అవసరమైన వారికి కంటి చూపు అద్దములు (కళ్ళ జోడు)లకు
రాంనగర్ నందు ఉన్న లయన్స్ క్లబ్ కు పంపించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్బు అధ్యక్షులు లయన్ హరిప్రసాద్, కోశాధికారి లయన్ విశ్వనాథ శాస్త్రి, ఉపాధ్యక్షులు లయన్ రమేష్, సేవా కార్యక్రమాల డైరెక్టర్ లయన్ వెంకట రామకృష్ణారావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ టెక్నీషియన్స్ చంటి,గోవింద్, చికిత్స సేవలు అందించారు.