జర్నలిజం వృత్తి ఎంతో బాధ్యత కలదని , ఉత్తమ సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు సత్కారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రమణ మూర్తి అన్నారు.
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందిస్తున్న జర్నలిస్టులు ప్రజాబలం ఆన్లైన్ న్యూస్ రిపోర్టర్ మానం శ్రీను మరియు లీడర్ దినపత్రిక సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఉప్పల భాస్కర్ లకు సోమవారం వారం సత్కరించారు.
వాసవి క్లబ్ ఎంవిపి కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా , కోశాధికారి నరసింగ రావు, కార్యక్రమాల అధ్యక్షులు వాసవియన్ శివరామకృష్ణ, పూర్వాధ్యక్షులు మల్లేశ్వర గుప్త , గ్రంధి కృష్ణారావు, లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరములు అనుభవం కలిగిన ప్రింట్ మీడియా జర్నలిస్టులకు, క్లబ్ తరపున సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీను గారు మరియు భాస్కర్ గారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారు అనేక సేవా కార్యక్రమంలో ముందుంటారని ప్రతిభకు పట్టం కడతారని తెలియజేస్తూ ధన్యవాదములు తెలియజేసినారు