వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 201 ఏ. విశాఖపట్నం జిల్లా గవర్నర్ వాసవి ఎన్ వంకాయల సాయి నిర్మల అంతర్జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 500 మంది రక్తదానంలో పాల్గొన్నారు.. విజయవంతమైన మెగా రక్తదాన శిబిరాలు... సాయి నిర్మలకు అభినందనల విలువ.. రక్తదాతలకు సర్టిఫికెట్ అందజేత..

అంతర్జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 2o1 ఏ విశాఖ జిల్లా గవర్నర్ వాసవి ఎన్ వంకాయల సాయినిర్మల ఎంతో దృఢ సంకల్పంతో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. 500 మంది రక్తదానం దాతలు. 
ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి ...జై జై వాసవి.. 
తేదీ 01.10 2026 గురువారం అంతర్జాతీయ స్వచ్ఛంద రక్త దానం దినం ను పురస్కరించుకొని 
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, 
వి 201 ఏ విశాఖపట్నం జిల్లా గవర్నర్ వాసవియన్ వంకాయల సాయి నిర్మలా అత్యంత ధృడ సంకల్పం తో చేపట్టిన మెగా రక్త దాన శిబిరంలలో 500 మంది పై బడి రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి విజయవంతం చేశారు...ఈ రక్త దాన శిబిరంలు 
ఏ వి ఎన్ కాలేజ్ , సీఎంఆర్ సెంట్రల్, సమతా డిగ్రీ కాలేజ్ 
 ఎంవిపి కాలనీ సెక్టార్ 10,గాయత్రీ డిగ్రీ కాలేజ్ 
 ఎంవీపీ డబుల్ రోడ్డు ,ఆర్కె టౌన్షిప్, డైమండ్ పార్క్ ,ఆదిత్య డిగ్రీ కాలేజ్ డాబా గార్డెన్స్ ,ఏలియన్స్ కాలేజ్ , వి డెంటల్ హాస్పిటల్, శంకరమఠం రోడ్డు ప్రిజం కాలేజ్ , సీతంపేట ,జిల్లా కోర్టు 
పబ్లిక్ లైబ్రరీ పలుప్రాంతములలో
ఐ ఆర్ సి ఎస్ బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్,ఏ ఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ల నిర్వహణలో ఈ రక్త దాన శిబిరంలు నిర్వహించడం జరిగినది. ఈమెగా రక్తదాన శిబిరంలు వాసవి క్లబ్బులు విశాఖపట్నం జిల్లా వైస్ గవర్నర్లు, రీజియన్ చైర్పర్సన్లు, జోన్ చైర్ పర్సన్స్ ,క్లబ్ ప్రెసిడెంట్ ల పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. గవర్నర్ సాయి నిర్మల మాట్లాడుతూ ఒక్కరోజులో 500 మంది పైబడి రక్తదాతలు ముందు కు వచ్చి రక్తదానం చేసినందుకు వారికి అభినందించినారు. ముఖ్యంగా కాలేజీలలో విద్యార్థులు , పబ్లిక్ లైబ్రరీలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో ఈ రక్తదానానికి స్పందించడం చాలా సంతోషం కలిగించిందని ,వివిధ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దాతలు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు కూడా అందజేసినారు. అదేవిధంగా రక్తదాన శిబిరంలు నిర్వహించిన యజమాన్యానికి వాసవి క్లబ్స్ విశాఖపట్నం జిల్లా తరఫున టీం సభ్యులు శాలువ తో సత్కరించి జ్ఞాపకలను అందజేసినారు.
అదేవిధంగా ఈ మెగా రక్తదాన కార్యక్రమానికి వివిధ రకములుగా సహాయ సహకారములు అందించిన విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్ టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.