విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి...జై జై వాసవి ...
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి 201 ఏ విశాఖపట్నం జిల్లా రీజియన్ 2 జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 06.10.2026, మంగళవారం మధ్యాహ్నం పితృదేవతల ప్రీత్యర్థం మహాలయ పక్షాల సందర్భంగా, వాసవియన్ చెరుకు కృష్ణ గారు మరియు కృష్ణకుమారి గార్ల ఆర్థిక సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , దళాయి వారి వీధి, పెద్ద వాల్తేరు నిరాశ్రయులైన వయో వృద్ధులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర గుప్త, కోశాధికారి నరసింగ రావు కార్యక్రమాల అధ్యక్షులు వాసవియన్ శివరామకృష్ణ, రీజియన్ 2 జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, పూర్వాధ్యక్షులు గోగుల నర్సింగరావు, బుడ్డెపు రామారావు, కోశాధికారి క్లబ్ సభ్యులు, హరగోపాల్, రాజేష్, సన్యాసిరాజు పాల్గొన్నారు