విశాఖ సిటీ సమితి, ఎండాడ సత్యసాయి మందిరం, కన్వీనర్ ఏవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నారాయణ సేవ... నారాయణ సేవలో సేవాదళ్.
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో
తేదీ 09.10.2026 శ్రీ సత్యసాయి భజన మండలి ఎండాడ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారిగా శ్రీ సత్యసాయి నారాయణ సేవ ప్రారంభించడం జరిగింది
ఈ నారాయణ సేవ ప్రతి నెల 9 వ తేదీన ఒక రోజు సభ్యులు మరియు భక్తులు ఇంటి వద్ద వండుకున్న ఆహారం ఫుడ్ ప్యాకెట్లు రూపంలో అందజేయటం జరుగుతుంది.అందులో భాగంగా ఈ దినం 58 ఫుడ్ ప్యాకెట్లు భక్తులు మరియు సభ్యులు అందచేయగా స్వామి వారికి నివేదన చేసి ద్వారక నగర్ బస్ స్టేషన్ ఏరియా నందు సంచరిస్తున్న నారాయణలకు అందజేయటం జరిగింది. కార్యక్రమంలో కన్వీనర్ వెంకట రామకృష్ణారావు, మందిరం ఇంచార్జ్ కృష్ణారావు , సేవాదళ్ సభ్యులు రామచంద్రరావు, గోపి, సూర్య నారాయణ రాజు, రఘునాథ సాయి, మానం శ్రీను.,సూరి, సాయి లక్ష్మీ,రవణమ్మ పాల్గొన్నారు.