వైయస్సార్ ఆసరా అక్క చెల్లెమ్మ లకు కొండంత భరోసా అవంతి
విశాఖ జిల్లా - కలెక్టర్ కార్యాలయం లో శనివారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం వైయస్సార్ పథకం క్రింద అర్హులైన స్వయం సహాయక సంఘాలకు 2022 - 2023 సం .. సంబంధించిన 3వ విడత బుణ మాఫీ కార్యక్రమం ఏలూరు జిల్లా దెందులూరు గ్రామంలో ఏర్పాటు చేసి మొత్తాన్ని సంబంధిత బ్యాంకు ఖాతాలుకు నేరుగా విడుదల చేయడం జరిగిందని దానిలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ జిల్లా లోని 2,59,231 స్వయం సహాయక సంఘాలు కు 177,21,00,000 కోట్లు రూ లబ్థి మొత్తం కలెక్టర్ మల్లిఖార్జున రావు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులు మీదుగా లబ్దిదారులు కు అందజేశారు..
కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం ఉన్న 25,571 కోట్లు రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టు కొని మాట తప్పకుండా మడం తిప్పకుండా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే అని ఇది ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 78,94 లక్షల మంది అక్క చెల్లెమ్మ లకు ఇప్పటికే 2 విడతల్లో 12,578 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించి వారికి ఊరట నివ్వడం జరిగిందని మూడో విడతగా 19,178 కోట్లు రూ అందించడం జరిగిందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యంగం లో పొందుపరిచిన మహిళా రిజర్వేషన్ అమలు చేయడం తో పాటు మహిళా సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అందించి మాతృమూర్తులకు బిడ్డగా - ఆడపడుచులకు అన్నగా - వేసే ప్రతీ అడుగులోనూ చేసే ప్రతీ ఆలోచనలోనూ మహిళా పక్షపాతి అయి సంక్షేమం సామాజిక న్యాయం తో జగనన్న ప్రభుత్వం లో మహిళలే మహారాణులు అనే రీతిలో నూతన పాలన ఒరవడులు తీసుకు వచ్చారని ఇంటికి ఇల్లాలు దీపం ఆ దీపం అనే మహిళ ఇంటిల్లి పాదికి వెలుగులు నింపాలనే వైయస్సార్ ఆసరా ని ప్రవేశ పెట్టి 3 విడతలో కూడా అందించడం జరిగిందని మహిళలు అంతా జగనన్న వెంటే ఉన్నారని రాభోయేది కూడా వైసిపి ప్రభుత్వం అప్పుడు కూడా మహిళలకు మరిన్ని సేవలు అందిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున రావు - స్వయం సహాయక సంఘం అదికారులు - ఆనందపురం మండలం జెడ్పిటిసి సుంకరి గిరి బాబు లబ్దిదారులు పాల్గొన్నారు.