ఇండియన్ రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కంది వెంకటరమణ మాస్టర్.
శనివారం(25.3.2023) గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి నియమించిన DRO M గణపతిరావు పర్యవేక్షణలో కలెక్టరేట్ లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యవర్గానికి ఎన్నికలు రాష్ట్ర రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శ్రీ పి.జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగాయి. విశాఖపట్నం చైర్మన్ డి.వై.శివ నాగేంద్ర రెడ్డి హాజరయిన ఈ ఎన్నికలలో 13 మంది మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులలో చైర్మన్ గా కె ఆర్.డి.ప్రసాదరావు వైస్ చైర్మన్ గా ఆర్ రాజగోపాల్ నాయుడు,కోశాధికారిగా టి.రామారావు గార్లను మిగిలిన సభ్యులు ఎన్నికయ్యారు. జామి మండలానికి చెందిన రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు,భార్గవ్ హెల్ప్ లైన్ స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు కంది వెంకటరమణను రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు (ఎగ్జిక్యూటివ్ మెంబర్) గాఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కంది వెంకటరమణ ఒక ప్రకటనలో తెలియజేసారు. DRO గణపతిరావు మాట్లాడుచు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కోవిడ్ లో సేవలద్వారా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నదని,జిల్లా రెడ్ క్రాస్ కు మంచి భవనాన్ని కూడా నిర్మించుకొని బ్లడ్ బాంక్ ద్వారా అనేకమంది కి ఆసరాగా నిలిచిందన్నారు. కంది వెంకటరమణ మాట్లాడుచు రాష్ట్ర స్థాయిలో గౌరవ గవర్నర్ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే ఇండియన్ రెడ్ క్రాస్ విజయనగరం అద్యక్షులు KRD ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనేక సామాజిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలు,రక్తదాన,ఐ బాంక్ కార్యక్రమాలు చేయడం జరుగుచున్నాయని
ఆ సేవా కార్యక్రమాలలో సేవచేసే భాగ్యం కలగడం అందముగా ఉన్నదని కంది వెంకటరమణ తెలియజేసారు.