*మొదటిరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు*
భీమిలి నియోజకవర్గం - జీవియంసి 4వ వార్డు - చేపలుప్పాడ సచివాలయం - బుదవారం
గడప గడప కు మన ప్రభుత్వం లో బాగంగా అవంతి శ్రీనివాసరావు గారు ప్రజలతో జగన్ మోహన్ రెడ్డి గారు పేదల కళ్ళల్లో ఆనందమే చూడాలన్నదే ఆయన ద్యేయం అని ఆయన పాలనలో ఉన్నోడు ఏడుస్తున్నాడు పేదోడు సంతోషం తో ఉన్నాడు రాజన్న రాజ్యం రావాలని కోరుకున్న ప్రతీ ఒక్కరి కళ నెరవేర్చడం లో వివక్షత లేకుండా పథకాలు అమలు చేస్తున్నారని అని నిరంతరం ప్రజలు కి సేవలు అందించాలనే తపనతో ఎక్కువ పని చేసి తక్కువ మాట్లాడే నాయకుడనిపేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు అమలు రివ్యూ లో బాగంగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మొదటిరోజు 235 ఇళ్ళు గడప గడప కు తిరిగి జగనన్న 3 ఏళ్ల పరిపాలనా కాలంలో వార్డు లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా అందాయని మహిళలు ముక్త కంఠంతో చెప్పడం జరిగింది.
ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని స్థానికులు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు.
చొక్కవానిపాలేం - పుక్కళ్ళపాలెం - కొత్తూరు లలో భీమిలి ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాస్దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు
1) పుక్కళ్ళపాలెం కొత్తూరు లో డ్రైనేజీ వాటర్ వాడుక కాలువ నీరు కలుషితం అయిపోవడం జరుగుతుంది 200 మీ R&B అనుకొని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని
2) చుక్కళ్ళపాలెం 72 మంది లబ్దిదారులుకు గతంలో సర్వే నెం 276/5 - 275/1 లో ఇళ్ళు పట్టాలు ఇవ్వడం జరిగింది కోర్టు కేసు ఉండటం వలన ఇళ్ళు కట్టుకోలేకపోతున్నాము కోర్టు కేసు సమస్య పరిష్కారం చేయాలని,
3) 282/3 సర్వే నెం లో లేఆవుట్ లో జగనన్న పట్టాలు కేసు కోర్టు లో ఉంది సమస్య పరిష్కారం చేసి ఇళ్ళు ఇప్పించాలని
4) పుక్కళ్ళపాలెం లో త్రాగునీరు సౌకర్యార్థం ఇంటికి కొళాయిలు (పైపు లైన్ నిర్మాణం చేపట్టి) వేయాలని.
సమస్యలు ని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చేయాలని అధికారులకు అవంతి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
సమస్యల పరిష్కారం పై సంపూర్ణ హామీ ఇచ్చిన అవంతి గారికి ప్రజలు ఆనందంతో దన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జీవియంసి వార్డు కార్పోరేటర్ లు వార్డు ఇంచార్జ్ లు వార్డు ప్రెసిడెంట్ లు సచివాలయం కన్వినర్ లు ఆయా పదవుల్లో ఉన్న వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రభత్వ అదికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ఆర్పీలు పాల్గొన్నారు