ఆనందపురంలో వినూత్నరీతిలో ఏర్పాటు చేసిన ఇగ్లూ సినిమా ధియేటర్ ప్రారంబించిన అవంతి
భీమిలి నియోజకవర్గం - ఆనందపురం మండలం - వెల్లంకి - బుదవారం
*ఆనందపురం తగరపువలస ఆనందపురం హై వే లోని వెల్లంకి వద్దనున్న గోకార్టింగ్ (కార్ రేస్) ఆవరణలో వినూత్న రీతిలో జిల్లాలోనే తొలిసారి విదేశాల్లో మాదిరి నిర్మించిన ఇగ్లూ సినిమా థియేటర్ ను మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు.
ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో వినోదం అందించేందుకు అధునాతన టెక్నాలజీతో మన ప్రాంతంలో థియేటర్ నిర్మించడం అభినందనీయమని చుట్టు పక్కల ఉన్న ప్రజలకు వినోదం అందుబాటులోకి వచ్చిందని విదేశాల్లో వినియోగించే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రేక్షకులకు మంచి ఎఫెక్ట్స్ తో అతి తక్కువ టికెట్ ధరలతో మొత్తం వంద సీట్లు తో వినోదం అందించాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో బుక్ మై షో యాప్ ద్వారా కూడా బుక్ చేసు కోవచ్చు అని అన్నారు. హీరో నాని, కీర్తి సురేష్ లు నటించిన దసరా సినిమా గురువారం నుంచి ఇగ్లూ చోటా మహరాజు థియేటర్లో ప్రదర్శించడం జరుగుతుందని రోజుకు నాలుగు ఆటలు వుంటాయి అని పేర్కొన్నారు దీనిని ప్రతీ ఒక్కరూ వినోదభరితంగా ఆశ్వాదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్, భీమిలి నియోజకవర్గం ఇంఛార్జి ఎం.మహేష్, ఎంపీపీ మజ్జి శారద ప్రియాంక, జెడ్పీటీసీ కోరాడ వెంకట రావు, సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణ రావు, నాయకులు బంక సత్యం, థియేటర్ యాజమాన్యం ప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు..