*కన్నుల పండువగా సీతారాముల కల్యాణం.!*
బొట్టవానిపాలెం శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా వేడుక.
వేల సంఖ్యలోతరలివచ్చిన భక్తులు. వేల సంఖ్యలో భక్తులకు భారీ అన్నసంతర్పణ.
మధురవాడ:జీవీఎంసీ 5వవార్డ్ పరిధి బొట్టవానిపాలెంలో గ్రామ పెద్దలు,యువత ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో స్వామి వారి కల్యాణం అంగరంగ వైవంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భద్రాద్రి వేడుకలను తలపించేలా ఇక్కడ కల్యాణోత్సవాన్ని జరిపించారు. వేదపండితుల మంత్రోశ్చరణ మధ్యపట్టు వస్త్రాలతో ముస్తాబైన సీతమ్మతల్లి మెడలో స్వామివారు తాళి కట్టిన దృశ్యం మనోహరంగా సాగింది.శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించిన అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ..శ్రీరామ వైభవాన్ని వివరించారు, సామాన్య మానవునిగా ఈ లోకంలో సంచరించి, యుగయుగాలకూ మార్గదర్శిగా నిలిచినా శ్రీరామచంద్రుడు నేటికీ మానవాళికి ఆదర్శం అన్నారు.కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఈ సందర్భంగా సుమారు 4000 మందితో భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాములువారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు అంతా కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.బొట్టవానిపాలెం గ్రామపెద్దలు,యువత పర్యవేక్షణలో అవసరమైన ఏర్పాట్లు చేశారు.