కనుల పండు గగా సీతారామ కళ్యాణం.

 కమనీయం రమణీయం సీతారాముల కళ్యాణం.


స్వతంత్రనగర్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.


 స్వామి వారి దర్శనానికి బారులు తీరిన భక్తులు.


 ప్రతినిధి మధురవాడ: జీవీఎంసీ 5,7,వార్డుల పరిధి స్వతంత్రనగర్ లో కొలువుతీరిఉన్న శ్రీ షిరిడి సాయి పంచాయతన ఆలయంలో..ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఆలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు అధ్యక్షతన శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి దర్శనానికి భక్తులు బారులుతీశారు,అధిక సంఖ్యలో భక్తులు ఈకార్యక్రమాలలో పాల్గోని స్వామి వారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ...గౌరవ సలహాదారులు సునీల్ కుమార్ పోలిమాటి,అధ్యక్షులు ఉగ్గిన నాగరాజు,ఉపాధ్యక్షులు కరకానిఈశ్వరరావు,

కోషాధికారి జీలకర్రగణేష్, లోలుగురమేష్ నాయుడు,

సహాయ కార్యదర్శి శివప్రసాద్,

ఉపకోషాధికారి దత్తిహరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.