అవంతిని గెలిపించే బాధ్యత కార్యకర్తలదే--- టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పిలుపు.

 భీమిలిలో మళ్లీఅవంతిని భారీ మెజార్టీతో గెలిపించాల్సినబాధ్యత కార్యకర్తలదే--- టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిపిలుపు. -----భీమిలి నియోజకవర్గం - పద్మనాభం మండలం (రేవిడి) ప్రజాబలం న్యూస్ --



రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమం రేవిడిలో శనివారం ముగింపు సభఏర్పాటు చేశారు. మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు కి భారీ బైక్ ర్యాలీ తో పూల వర్షాల అబినందనలు తో సాంస్కృతిక ఆటల పాటల మోతలతో, అవంతి ఆధ్వర్యంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.


ఈకార్యక్రమం లో బాగంగా నియోజకవర్గం లో గడప గడపకు వెళ్ళి ఈ నాలుగేళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన కోసం ప్రజలు కు వివరించి, ప్రచారం చేసి, మిస్ కాల్స్ ఇచ్చి, సంపూర్ణ విజయ వంతం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

 ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గడప గడపకు వేళ్ళే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆరంభం మాత్రమే అంతం కావని ఇది వైసిపి లో నిరంతర ప్రక్రియ అని మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమం రాష్ట్రంలో 1.45 కోట్లు కుటుంబాలు స్వచ్చందంగా పాల్గొన్నాయని 1.10 మిస్ కాల్స్ అందివ్వడం జరిగిందని భీమిలి నియోజకవర్గం లో అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రచారం చేసి విజయ వంతం చేయడం జరిగిందని, గత ప్రభుత్వాలు వారి పదవులు అధికారం కోసం పాటు పడితే, వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజలు సంక్షేమ కోసం పని చేసారని, వైసిపి ప్రభుత్వం మాటలు తో కాదు చేతల్లో చేసి చూపే ప్రభుత్వం అని, ప్రజాసేవ అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిరి నుంచి వచ్చిందని,ఆయన స్పూర్తి తో భీమిలి నియోజకవర్గం లో నిరంతరం ప్రజలు మద్య తిరిగాడే నాయకుడైన నాకు అత్యంత స్నేహితుడు, సోదరుడైన అవంతి శ్రీనివాసరావు ని రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీ తో గెలిపించుకునే భాద్యత మీపై ఉందని, భీమిలి పై సియం కి ప్రత్యేక దృష్టి సారించారని వైజాగ్ నుంచే పాలన ప్రారంభిస్తారని రాబోవు దినాల్లో మీ భీమిలి అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.


అనంతరం భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమం కి ప్రజలు లో ఇంత మంచి స్పందన రావడానికి కారణం పాదయాత్ర లో ఏదైతే మాటిచ్చారో ఇచ్చిన మాట ప్రకారం కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష చూపకుండా,పైసా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంపూర్ణంగా సేవలు నేరుగా గడప గడపకు అందివ్వడమే అని జగన్ పేదల పక్షపాతి, పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారి కళ్ళళ్ళో ఆనందం చూడటమే ఆయన లక్ష్యం అని,ప్రజా పాలనలో తండ్రి ఒక అడుగు వేస్తే ఆయన కుమారుడైన జగనన్న పది అడుగులు వేసి సుభిక్షమైన పాలన అందిస్తున్నారని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటన చేస్తున్నప్పుడు ప్రజలు ముఖ్యంగా మహిళలు నుంచి మంచి స్పందన వస్తోంది అని,ఇది రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలుపుకు నాంది అని, నియోజకవర్గం వర్గం లో వైసిపి శ్రేణులు మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమం లో, ఏవిధంగా సమిష్టి గా పని చేసి విజయ వంతం చేసారో, రాబోయే ఎన్నికల్లో అలాగే పని చేసి పార్టీ గెలుపుకు పని చేయాలని గతంలో శిలాఫలకాలు వేసి పూర్తి చేయకుండా సెల్ఫీ చాలెంజ్ లు చేయడం కాదు,పని చేయడం కావాలని పని చేయని మీకు చేసే వారిని ఇలా ఎవరికి ఉపయోగం లేని ఇటువంటివి ప్రజలు ఎవరూ పట్టించుకోరని అన్నారు.



అనంతరం వైవి సుబ్బారెడ్డి చేతులు మీదుగా కేకు కటింగ్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించి ప్రజా మద్దతు పుస్తకాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..