ఇనార్బిట్ మాల్ తో విశాఖలో ఉపాధి, అభివృద్ధి, శంకుస్థాపన చేసిన.---సీఎం జగన్. విశాఖపట్నం మధురవాడ--- (ప్రజాబలం న్యూస్) 600 కోట్ల రూపాయల వ్యయం తో 15 ఏకరాల విస్తీర్ణం లో రహెజ గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు ముఖ్యమంత్రి వై యశ్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం భూమి పూజ చేసారు,ఈ కార్యక్రమంలో రహేజ గ్రూప్ ప్రగతిని వీడియో ద్వారా ప్రదర్సించారు,రహెజా గ్రూప్ చైర్మన్ రజనీష్ మహాజన్,రహేజా గ్రూప్ చైర్మన్ నీల్ రహీజా తమ సంస్థ యొక్క ప్రగతిని వివరించారు,,అనంతరం ముఖ్యమంత్రి వై యశ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇనార్బిట్ మాల్ విశాఖ నగరానికి ఒక ఆణిముత్యం అని చెప్పారు,15 ఏకరాల్లో మాల్ నిర్మాణం జరుగుతుంది అని ఇందులో 2 ఏకరాల్లో ఐటి సెంటర్ నిర్మాణం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరుగుతాయి అని చెప్పారు,,ఇక్కడ మాల్ నిర్మాణం తో విశాఖ నగరం రూపు రేఖలు మారుతాయి అని చెప్పారు,మాల్ నిర్మాణం వలన 8,000 మందికి ప్రత్య
క్షం గా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అని చెప్పారు,,ఈ మాల్ సౌత్ ఇండియా లోనే అతి పెద్ద మాల్ అని చెప్పారు,,ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వలన మరో 3,000 మందికి ఉపాధి లభిస్తుంది అని చెప్పారు,,అనంతరం ముఖ్యమంత్రి వై యశ్ జగన్మోహన్ రెడ్డి జివియంసి 136 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు జీవియంసి కార్యాలయంలో శంఖుస్థాపన చేశారు,,అనంతరం దేశంలో అతిపురతనమైన యునివర్సిటీ ల్లో ఒకటైన ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సెంటర్ ను ప్రారంభోత్సవం చేశారు,,ఈ సెంటర్లో 5 రంగాల్లో శిక్షణ ఇవ్వడం అదేవిధంగా పరిశోధనలు నిర్వహిస్తా మనీ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీ తెలియజేశారు,,ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ విద్యాశాఖ మంత్రి,బొత్స సత్యనారాయణ,,డిప్యూటీ సిఎం బూడి (ఈ సందర్భంగా ముఖ్యమంత్రిిి జగన్మో్మోోహన్ రెడ్డికి కి పుష్ప్పగుచ్చం అందజేస్తున్న అవంతి శ్రీనివాస్)
ముత్యాలనాయుడు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు,శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్,అన్నపురెడ్డి ఆదిప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి,మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి,ఉత్తర నియోజకవర్గ ఇంఛార్జి కే కే రాజు, వివిధ విభాగాల అధికారులు, జీవీఎంసీ అధికార వైసిపి కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.