ప్రజల గుండెల్లోచిరస్మరణీయుడు కామ్రేడ్ పోతిన సన్యాసిరావు.
మధురవాడలో ఘనంగా నివాళులు
మధురవాడ ---- ప్రజా బలం న్యూస్ -- తుది శ్వాస విడిచినంతవరకు ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం కోసం పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు కామ్రేడ్ పోతిన సన్యాసిరావు చిరంజీవి అని పలువురు నాయకులు కొనియాడారు. శనివారం మధురవాడ సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ, మధురవాడ క్వారీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతిన 39 వ వర్ధంతిలో పలువురు నాయకులు మాట్లాడుతూ మధురవాడ ప్రాంతంలో విద్య, వైద్యం, రహదారులు మొదలైన మౌలిక సమస్యలు పరిస్కారం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని, క్వారీ సొసైటీ స్థాపించి వండలాది మందికి ఉపాధి కల్పించారని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్వారీ అధ్యక్ష కార్యదర్సులు పిల్ల అప్పన్న, వాండ్రాసి రవి కుమార్, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిల్ల సుజాత, పిల్ల సత్యనారాయణ, టీడీపీ నాయకులు గొల్లంగి ఆనందబాబు, దాసరి శ్రీనివాస్, ఎన్ సూర్య ప్రకాష్, నమ్మి నర్సింహులు, సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, ఎం డి బేగం, పి కాంతమ్మ, పలువురు క్వారీ పాలకవర్గ సభ్యులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.