మధురవాడ శిల్పారా
మంలో జాతీయ చేనేత స్కిల్ వస్త్రాల ప్రదర్శన----
చేనేత కళాకారులను ఆదరించండి--- స్టేట్ నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత -- 6వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక. మధురవాడ---- ప్రజాబలం న్యూస్ --- మధురవాడ శిల్పారామం(జాతర)లో వినాయక చవితి సందర్భంగా తేదీ 15-9-23 శుక్రవారం నుండి 4-10-23 బుధవారం వరకు 20రోజుల పాటు నిర్వహించే జాతీయ చేనేత స్కిల్ ఎక్స్ పో
క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్,హండ్రీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ హస్తకళ ప్రదర్శనను జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ చేనేత స్కిల్ ఎక్స్ పో కు ఉచిత ప్రవేశం కల్పించామని ఉదయం 11గంటల నుండి రాత్రి 9గంటల వరకు ప్రతిరోజు కొనసాగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈసందర్భంగా జీవీఎంసీ చీప్ విప్,6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ.. కళలు చేనేత వస్తువులు తయారుచేసే చేతివృత్తి కళాకారులకను,చేనేత దారులకు చేయూతనిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలవాలని కోరారు. ప్రాచీన కళలను ప్రోత్సహించి భావితరాలకు అవి అందే విధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. శిల్పారామంలో జాతీయ చేనేత స్కిల్ ఎక్స్ పో హస్తకళ ప్రదర్శనలో వివిధ ప్రాంతాలలో దేశం నలుమూలల నుండి సుమారు 20రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల చేతి వృత్తి కళాకారులు చేసిన అరుదైన వస్తువులు ఒకే చోటకు చేర్చి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రజలందరూ ఈసదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ ప్రదర్శనలో వెంకటగిరి పట్టు సారీస్, ఉప్పాడ కుప్పడం పట్టు సారీస్, భాగల్పూర్ చీరలు, జైపూర్ బెడ్ షీట్స్ టాప్స్, చందేరి కాటన్ సారీస్ నారాయణపేట సారీస్,కాశ్మీర్ సారీస్,బెంగాల్ కాటన్, మంగళగిరి సారీస్ డ్రెస్ మెటీరియల్స్,కలంకారీ సారీస్,
రంగుల బొమ్మలు ఫోటోలు ఎన్నో రకాల వస్తువులు,వస్త్రాలు ప్రదర్శనలో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం పరిపాలన అధికారి విశ్వనాథరెడ్డి, జోన్ టు కమిషనర్ కనకమహాలక్ష్మి, ఆరవ వార్డు వైసిపి అధ్యక్షుడు బి అప్పలరాజు, గుంటుబోయిన సంజీవ్ యాదవ్, పోతిన రమణబాబు, పిల్ల రమణ,7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, పిల్ల సూరిబాబు, ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.