మట్టిగణపతి విగ్రహాలతో పూజిద్దాం పర్యావరణం కాపాడుదాం
మధురవాడ--- ప్రజాబలం న్యూస్ ---డాక్టర్ మణి భూషణ్ ఉద్యమం.
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా , ఎం వి పి కాలనీ లోని అడ్మిన్ ఆఫీస్ నందు ఉచిత మట్టిగణపతి విగ్రహాలను ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ చేతులమీదుగా భక్తులకు వితరణ చేసారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో ముఖ్యఅతిధి ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ నుండి విచ్చేసిన రామేశ్వరి మాట్లాడుతూ ప్రధమ గణపతి పూజ భారత దేశం మొత్తం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే అతిపెద్ద హిందూ పండగ ఆబాల గోపాలం అందరు చాల ఆనందం గా చేసే వ్రతం , వినాయకుడు జ్ఞానానికి , బుద్ధికి , సిద్ధికి , విగ్నానికి అధిపతి , అందరికి కోరిన వరాలు అందించే గణనాధుడు పూజ పరమ పవిత్రం అందరూ గణపతి పూజచేసి ఆశీస్సులు పొందాలని అనుగ్రహ భాషణం చేసారు.
దర్శకుడు మణి భూషణ్ మాట్లాడుతూ ప్రకృతి దైవస్వరూపం అలంటి ప్రకృతిని కాపాడే దిశగా జరిపే పండగ గణేష్ చతుర్థి , వినాయకవిగ్రహాలను ప్రకృతికి పర్యవరణానికి అనువైన మట్టి విగ్రహాలతో జరపడం వలన , మన భూమిని మనం రక్షికించుకునే వాళ్ళం అవుతాం . అలాగే వినాయక పండగ వైభవంగా చేసుకునే అవకాశం పొందుతాం. వినాయకుడికి వ్రతం లో ఇష్టమైన వివిధ పత్రులు,పిండివంటలు , ఉండ్రాళ్ళు , చెరుకులు, పప్పు బెల్లం , అటుకులు , నవవిధ పళ్ళు , పాయసం , అరిది వంటి సాంప్రదాయ వంటకాలతో చిన్న పెద్ద అతి సంతోషం తో చేసే సంబరం ఇదే, పండగలు మన దేశ ప్రగతిలో ప్రధాన పాత్రపోషిస్తు మానవత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. ఇలాంటి విశిష్టమైన పండగను ప్రకృతి సహజంగా చేసుకోవడం , పర్యవరణ హితంగా జరుపోకోవడం వలన ఎన్నో లాభాలు పొందుతాము . అందుకే కృత్రిమ రసాయనిక రంగులు తో చేసిన గణపతి విగ్రహం కన్నా మట్టి తో చేసిన గణేష్ ప్రతిమ వాడడం శుభం. ప్రతి ఒక్కరు మట్టి గణపతి తో పూజ చేసి ఆనంద అస్సిసులు పొందాలని విశాఖ ట్రావెల్ టూరిజం ఫౌండేషన్ కోరుతూ ఈ ఉద్యమం చేపట్టిందని గత సంవత్సరం కూడా మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా ఇచ్చామని తెలిపారు . ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ, హీరో నిర్మాత ఆదిత్యభూషణ్ , సన్ మూర్తి, కీర్తి పట్నాయక్ , నటరాజ్ మాస్టర్, రంగనాయకులు , బ్రహ్మకుమారీస్ సభ్యులు , బలిరెడ్డి సూర్యారావు,హేమంత్ , మురళి , జగన్ ,భక్తులు హాజరయ్యి మట్టి గణపతి విగ్రహాలను ఆనందంగా స్వీకరించారు.
విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్,
9848418582
విశాఖపట్నం.
