హ్యాండ్స్ టు హెల్ప్ ఆధ్వర్యంలో ఘనంగాఎసిపి వివేకానంద జన్మదిన వేడుకలు.
మధురవాడ-- ప్రజాబలం న్యూస్-- విశాఖ దిశ ఏసిపి సి. హెచ్ వివేకానంద జన్మది వేడుకలు హ్యాండ్స్ టు హెల్ప్ ఆధ్వర్యంలో సోమవారంఘనంగా నిర్వహించారు. మధురవాడ బక్కన పాలెం కి వెళ్లే రోడ్లో గల స్థానిక అమ్మ ఒడి బాలల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్స్ టు హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ పిళ్ళా చిన్ని వెంకట్ మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్ పెంపొందించుకోవాలని, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. వివేకానంద ఎంతోమంది యువతకి ఆదర్శనీయలని, పిల్లలు ఆయనలా బాగా చదువుకుని చక్కని భవిష్యత్తును పొందాలని గణనాథుని ప్రార్థించారు.మధురవాడ ప్రాంతంలో వివేకానంద సిఐ గా పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవలు అందించారని పేర్కొన్నారు. వివేకానందకు మధురవాడ ఒక సొంత ఊరి లాంటిదని అందరితోను ఇప్పటికీ స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే విధి నిర్వహణలో ఎక్కడ రాజీ పడకుండా మంచి సేవలు అందించారన్నారు. ఆయన ఇదే ప్రాంతంలో ఏసీపీగా పనిచేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. ఆయన లానేవిద్యార్థులంతా బాగా చదివి సమాజానికి దోహదపడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోతిన నానాజీ,పిళ్ళా అప్పలరాజు, దళాయి శివ,శ్రీను, గణేష్,అరుణ్, తదిరులు పాల్గొన్నారు.


