చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కాగడాల ప్రదర్శన

 భీమిలి లో కాగడా


ల ప్రదర్శన --- భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు. భీమిలి నియోజకవర్గం --మధురవాడ--- ప్రజాబలం న్యూస్-- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ, అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భీమిలి చిన్న బజార్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుండి కాగడాల ర్యాలీ ప్రారంభించి సుమారు రెండు కిలోమీటర్లు మేర ర్యాలీ చేశారు . ఈ సందర్భంగా భీమి నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు. మాట్లాడుతూ ఈ కాగడాలు ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేసి సత్య అన్వేషణ చేసే విధంగా ప్రజల్లో మార్పు రావాలని అన్యాయంగా చంద్రబాబు పైన తీసుకున్నటువంటి చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని, ఇకనైనా వైసిపి ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో వారితోపాటు భీమిలి నియోజకవర్గం నాయకులు నాయకురాళ్లు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కాగడాల ర్యాలీ విజయవంతం చేసినప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.