అడుగడుగునా అవంతికి ఘన స్వాగతం ---బ్రహ్మరథం పడుతున్న జనాలు.

 భీమిలి నియోజకవర్గం - పియం పాలెం 6వ వార్డు - సచివాలయం కోడ్ 21086049 -శని వారం మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆరువ వార్డ్ కార్పోరేటర్ ముత్తంశెట్టి లక్ష్మి ప్రియాంక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 


 యన్టీఆర్ కోలనీ లో రెండవ రోజు పర్యటన కు ముందుగా.విచ్చేసిన అవంతి కి - అడుగడుగునా ప్రజలు నాయకులు అభిమానులు సాదర స్వాగతం పలికి జేజేలు కొట్టారు.


పర్యటనలో భాగంగా 6వ వార్డు పరిదిలో గల లచ్చి రాజు లే అవుట్ లో స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఏర్పాటు కు జీవియంసి సాధారణ అంచనా 1.92 లక్షలు రూ నిధులతో కార్పోరేటర్ జీవియంసి చీఫ్ విప్ ముత్తంశెట్టి ప్రియాంక చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. యన్టీఆర్ కోలనీ గల తులసి నగర్ - అశోక్ నగర్ - ముస్లిం కోలనీ లలో రెండవ రోజు గడప గడపకు వెళ్ళి (9 క్లస్టర్ లు) 620 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ఈ నాలుగేళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై వివరించి ప్రజలు అబిప్రాయం తెలుసుకున్నారు.


వైసిపి ప్రభుత్వం పాలనలో మేమంతా సంతోషం గా ఉన్నామని జనాలు చెబుతున్నట్లు అవంతి తెలిపారు.


అశోక్ నగర్ - తులసి నగర్ - ముస్లిం కోలనీ లో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అవంతి అడగగా ఆయన దృష్టిలో అనే సంస్థలు వచ్చాయని వాటి పరిష్కారం కృషి చేస్తా అని పేర్కొన్నారు.


తులసి నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని,


SFC కోలనీ లో కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని,


ముస్లిం కోలనీ లో శ్మశానం ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని, 


ఇంటి పన్నులు వేయడం లేదు సమస్య పరిష్కారం వేయాలని,  

ఇంటర్ననల్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని,


పలు కారణాలు చేత కొంతమందికి సంక్షేమ పథకాలు అందలేదనివాటిని మరల పునర్వపరిశీలన చేసి అందేలా చేయాలని అవంతి దృష్టికి తీసుకెళ్లారు 


 . 




ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు - వార్డు వైసిపి శ్రేణులు - సచివాలయం సిబ్బంది వాలంటీర్లు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు