అన్న ప్రసాదాన్ని అందజేస్తున్న భీమిలి వైసిపి ఇన్చార్జ్ మహేష్

 ఆధ్యాత్మిక సేవతో ఆత్మసంతృప్తి ---భీమిలి వైసిపి ఇన్చార్జ్ మహేష్


 భీమిలి నియోజకవర్గం--- ప్రజాబలం న్యూస్ - గణేష్ నవరాత్రులు సందర్భంగా భీమిలి నియోజకవర్గం పలు జీవియంసి వార్డు లలో వినాయక మండపాలు వద్ద అన్నసంతర్పణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని అన్న భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ముందుగా మహేష్ కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ యువత భక్తి భావాన్ని పెంపొందించుకొని భగవంతుని సేవతో నిమగ్నమై వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. యువత పెడదారి పట్టకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి దోహదపడే విధంగామరింత ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరువ వార్డు వైసిపి అధ్యక్షుడు బి. అప్పలరాజు, సీనియర్ వైసీపీ నేత గుంటుబోయిన సంజీవ్ యాదవ్, 5వ వార్డు వైసీపీ సీనియర్ నేతపోతిన సురేష్, పిల్లా రమణ, తదితరులు పాల్గొన్నారు.