వాలంటీర్ల సేవలు అమోఘం -- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ -

 శభాష్ అనిపించుకుంటున్న వాలంటీర్లు. -- వారి అమోఘం -- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.- ----మధురవాడ---- ప్రజాబలం న్యూస్ --



భీమిలి నియోజకవర్గం - జీవియంసి మదురవాడ జోన్ 2 - 5వ వార్డు (NGO లే అవుట్) - సచివాలయం కోడ్ 1086074) - 24-09-2023 - ఆది వారం


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు 5వ వార్డు ఎన్జీవోలే అవుట్ లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పర్యటించారు.

 ఈ సందర్భంగా అవంతి కి ( మాజీ కార్పొరేటర్) వార్డు ఇంచార్జ్ పోతిన హనుమంతు రావు ఆధ్వర్యంలో స్థానికులు అడగడుగునా ఘన స్వాగతం పలికారు. 



 ఇందులో బాగంగా అవంతి ఎన్జీవో లే అవుట్ లో రెండవ రోజు (9 క్లస్టర్ లలో) 445 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ఈ 4 ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై ప్రజలకు అవగాహన కల్పించారు.


వైసిపి ప్రభుత్వ పాలన పై స్థానికుల అభిప్రాయం అడగగా వాలంటీర్లు ద్వారా నేరుగా ప్రజలకే సేవలు అందించడం న్యాయం జరుగుతుందని, మళ్ళీ జగనే రావాలి ప్రజలు సంతోషం తో హర్షం వ్యక్తం చేశారు.బి టి ఎస్ పారడైజ్ అపార్ట్మెంట్ - వైయస్సార్ కోలనీ 1-6 బ్లాక్స్ - పద్మజా ప్రైడ్ అపార్ట్మెంట్ లలో స్థానికులు ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


 ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వివరించారు.కొండ ప్రాంతం పైకి త్రాగునీరు సౌకర్యార్థం నీరు అందెలా చూడాలని


డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టాలని.డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టాలని.


 సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని,


సిసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని,

పలు కారణాలు చేత సంక్షేమ పథకాలు అమలు కాలేదు వాటిని మరల పునర్వపరిశీలన చేసి అందేలా చేయాలని,


సమస్యలు విన్న అవంతి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.


సమస్యలు పరిష్కారం కి శ్రీకారం చుట్టిన అవంతి కి స్థానికులు సంతోషం దన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జోన్ టు కె. కనకమహాలక్ష్మి , వైసిపి మహిళా నేత చేకూరి రజిని జే ఎస్ రెడ్డి,- జీవియంసి వైసిపి శ్రేణులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు - కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు - పాల్గొన్నారు.