శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. నగరంపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు.

💐ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ 💐🙏
(💐🙏 సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ💐🙏 )
నగరంపాలెంలో వైభవంగా శాకాంబరీ ఉత్సవం.

అమ్మవారికి సారె సమర్పణ.
 
​మధురవాడ:
మధురవాడ,నగరంపాలెంలోని శ్రీకనకదుర్గాదేవి ఆలయంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.అమ్మవారు వివిధ రకాల కూరగాయలు, పండ్లు,ఆకుకూరలతో
శ్రీశాకాంబరీ దేవిగా భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.వానలు బాగా కురిసి మధురవాడ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.​సాయంత్రం నగరంపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవుడి ఇల్లు వద్ద మహిళలు సారెకు పూజలు చేసి,మంగళ హారతులు నడుమ నగరంపాలెం ఊరంతా ఊరేగింపుగా బయలుదేరారు. మేళతాళాలు,డప్పు వాయిద్యాలు,కోలాటాలు, బాణాసంచా పేలుళ్ల నడుమ మహిళలు భక్తిశ్రద్ధలతో సారెను తలపై ధరించి శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరుకున్నారు. పసుపు,కుంకుమ,సుగంధ ద్రవ్యాలు,అరిసెలు, పిండివంటలు,నూతన వస్త్రాలు,ఆభరణాలు,ఫలాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం ప్రదర్శించిన కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకోగా, ప్రాంగణమంతా దుర్గానామ స్మరణలతో మార్మోగింది.​ఈమహోత్సవంలో వాండ్రాశి వారి కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు,అర్చకులు,పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య అనుగ్రహం పొందారు.