వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవంతిని ఆశీర్వదించండి---- వై వి పిలుపు.... ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసిన భీమిలి అభివృద్ధి కోసమే అవంతికృషి --- శిష్యుడు మంత్రిగుడివాడ. --- ఎక్సైజ్ శాఖ గోడౌన్స్ నిర్మాణ శంకుస్థాపన లో అవంతికి. అండగా మాట్లాడిన నేతలు

 ఎక్సైజ్ శాఖ గోడాన్స్ నిర్మాణం కి శంకుస్థాపన చేసిన మంత్రి కాకాని... వై వి సుబ్బారెడ్డి, అమర్నాథ్, అవంతి శ్రీనివాస్,


భీమిలి నియోజకవర్గం--- ప్రజాబలం న్యూస్ -- ఆనందపురం మండలం - కణమాం పంచాయతీ (గోరంట్ల) గురువారం



రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కృషి తో ఆనందపురం మండలం కణమాం పంచాయతీ గోరింట లో 5 ఎకరాలు భూమి లో 20 కోట్లు రూ నిధులతో విశాలవంతమైన ఏ.పి.భేవరీస్ డిపో నిర్మాణం కి శ్రీకారం చుట్టారు. అవంతి అధ్యక్షతన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి చేతులు మీదుగా శంకుస్థాపనజరిగింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ,వైవి సుబ్బారెడ్డి, భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకం వేశారు. ఈసందర్భంగా భీమిలి మాజీ మంత్రి యంయల్ఏ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లోనే 3 లక్షలు కు పైగా ఓట్లు కలిగిన అతిపెద్ద నియోజకవర్గం అయిన భీమిలి లో సంక్షేమం అభివృద్ధి క్రింద 1000 కోట్లు కేటాయింపు జరిగిందని అందులో భాగంగా ఒక్క ఆనందపురం మండలం కే 400 కోట్లు ఖర్చు చేసి అబివృద్ది పనులు చేయడం జరిగిందని,పరిపాలనా రాజదాని గా విశాఖ వస్తున్న తరుణం లో అన్ని రకాల వనరులు ఉన్న భీమిలి లో ఉండి పాలన అందించడానికి భీమిలి ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు

,ఇదే ఆనందపురం లో గత ప్రభుత్వాలు వేములవలస లో పేదవారికి ఇళ్ళు ఇవ్వకపోగా కోర్టు లో కేసు వేస్తే కోర్టు లో జయించి పేదలు అందరికీ న్యాయం జరిగిందని పేర్కొన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటన లో గుర్తించిన సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని,కంపెనీలు కూడా రావడం పార్కు లు నిర్మాణం తో భవిష్యత్తు లో ఉన్నతమైన ప్రాంతం గా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఏదైతే భూమి ని సేకరించారో ఇక్కడే MSN లే అవుట్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి చెప్పడంతో పాటుగా అంచెలంచెలుగా భీమిలి అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని అన్నారు.


అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని,కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా వాలంటీర్లు ద్వారా పాలన అందిస్తూ నూతన పాలన కు శ్రీకారం చుట్టి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అనుసరించేలా పాలన చేసి పేదల మనసుల్లో ఉన్నారని ఈరోజు ఇక్కడ నెను మంత్రి గా ఉన్న సమయంలో ఇక్కడ ఏపి.భేవరిస్ డిపో రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.


వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదల కళ్ళల్లో ఆనందమే చూడటమే జగనన్న లక్ష్యం అని,పేదలకు సేవలు అందించడం లో తండ్రి ఒక అడుగు వేస్తే ఆయన కుమారుడైన జగనన్న పది అడుగులు వేసి రాజన్న రాజ్యం జగనన్న తోనే సాద్యం అనేలా పాలన అందించారని,భూములు ఇచ్చిన రైతులకు గతంలో నా చేతులు మీదుగా చెక్కు అందించడం జరిగింది అని,మిగతా వారికి త్వరలో అందివ్వడం జరుగుతుంది అని,అలాగే సోదరుడు అవంతి భీమిలి నియోజకవర్గం అభివృద్ధి కై ఎంతో కృషి చేసారని,రాబోయే ఎన్నికల్లో భీమిలి లో అవంతి ని భాద్యత తో గెలిపించుకునే బాధ్యత మీపై ఉందని,అవంతి భీమిలి నియోజకవర్గం లో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కి చేయడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు.


ఐటి శాఖ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అవంతి ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు కి వచ్చినా ముఖ్యమంత్రి ని కలిసిన ప్రతీ సారి భీమిలి నియోజకవర్గం సమస్యలు ప్రస్తావిస్తూ సియం దృష్టిలో పెట్టి పట్టువదలని విక్రమార్కుడు లా సాధిస్తారని.ఐటి శాఖ మంత్రి గా శాఖ పరంగా నావంతు సహాయ సహకారాలు అందిస్తానని శిష్యుడు గురువుకి అండగా నిలుస్తానని పేర్కొన్నారు.





ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు - మండలం వైసిపి శ్రేణులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు - ప్రజలు పాల్గొన్నారు.